కరీంనగర్, తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్ కు చేరుకున్న సీఎం కేసీఆర్. నిన్న సాయంత్రం కరీంనగర్ లో ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కలెక్టర్ ఆర్ వి కర్ణన్, సీపీ సత్యనారాయణ, ఇతర నేతలు. హుజురాబాద్ లో వివిధ పార్టీల ఎన్నికల ప్రచార తీరును ముఖ్యమంత్రి ఆరా తీశారు. రోజువారిగా తెరాస నిర్వహిస్తున్న కార్యక్రమాల్ని మంత్రి గంగుల కమలాకర్ వివరించారు.
ఈ రోజు ఉదయం అలుగునూర్ లో జరిగే టీఆర్ఎస్ కార్మిక విభాగం నేత రూప్ సింగ్ కుమార్తె వివాహానికి సిఎం కెసిఆర్ హాజరు కానున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం కరీంనగర్ కలెక్టరేట్ లో దళిత బంధు పథకం అమలుపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పథకం అమలులో అనుసరించాల్సిన విధానాలు, సమస్యల పరిష్కారంపై అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వం దళితబందు పైలట్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.