Sunday, November 24, 2024
HomeTrending Newsధరణి వ్యవస్థ పారదర్శకం

ధరణి వ్యవస్థ పారదర్శకం

పది జిల్లాలకు కొత్తగా నియమితులైన జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శనివారం బిఆర్ కెఆర్ భవన్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లో ధరణి వ్యవస్థపై ఓరియేంటేషన్ అవగాహన కల్పించారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షలు, ముందు చూపుతో చేసిన సూచనల ప్రకారం ధరణి పోర్టల్ ను అభివృద్ధి చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. భూ రికార్డులను సమగ్రంగా ఏకీకృతంగా నిర్వహించుటకు ట్రాన్స్ యాక్షన్ లను ఎప్పటికప్పుడు ఆధునీకరించడానికి ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఇది ఒకటి అని ప్రధాన కార్యదర్శి తెలిపారు. భూ సమస్యలను పరిష్కరించడానికి దేశంలోని మరే ఇతర రాష్ట్రంలో ఈ వ్యవస్థను అమలు చేయడం లేదని అన్నారు. ధరణి ప్రారంభించిన ఒక సంవత్సరం కాలం లోనే 8 లక్షలకు పైగా లావాదేవీలు జరిగాయి. ధరణి పోర్టల్ ఇప్పటివరకు 4 కోట్లకు పైగా హిట్లను పొందింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, పారదర్శకంగా పనిచేసే విధంగా ధరణి మాడ్యూల్స్ ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

ధరణి ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం ఆన్ లైన్ స్లాట్ బుకింగ్ ఆధారంగా మాత్రమే పని చేస్తుందని ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ వ్యవస్థను సక్రమంగా అమలు చేసేలా చూడాలని, పెండింగ్ లో ఉన్న ధరణి గ్రీవేన్స్ ను క్లియర్ చేయడానికి ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ధరణి గ్రీవేన్స్ ను పరిష్కరించడంపై ఉదాహరణలతో జిల్లా కలెక్టర్లకు వివరించారు.

ఈ వీడియోకాన్ఫరెన్స్ లో సిఐజి వి.శేషాద్రి, ఎండి, టిఎస్ టిఎస్ జి.టి.వెంకయ్యరావు, OSD to HCM రామయ్య, శ్రీమతి హరిత, నల్గొండ కలెక్టర్  ప్రశాంత్ జీవన్ పాటిల్, మెదక్ కలెక్టర్ హరీష్, రాజన్న సిరిసిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, వరంగల్ కలెక్టర్ బి.గోపి, నాగర్ కర్నూలు కలెక్టర్  పి.ఉదయ్ కుమార్, కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జనగాం కలెక్టర్ సిహెచ్.రామలింగయ్య, జోగులంబ గద్వాల కలెక్టర్ వల్లూరి క్రాంతి, యదాద్రి భువనగిరి కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్