Sunday, January 19, 2025
HomeTrending Newsఎదిగే కొద్దీ ఒదిగి ఉన్న నేత పివి నరసింహారావు

ఎదిగే కొద్దీ ఒదిగి ఉన్న నేత పివి నరసింహారావు

Pv Narasimha Rao : తన భూములను పేదలకు పంచి నాడు ఉమ్మడి రాష్ట్రంలో భూ సంస్కరణలకు బీజం వేసిన భూ ధాత, ఆచరణ శీలి పివి నరసింహారావు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. ఆర్థిక సంస్కరణలు చేపట్టిన ఆర్థిక వేత్త. ఆర్థిక సంస్కర్త చేసిన సేవల్ని గుర్తు చేశారు. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 17వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీ లోని అంబేద్కర్ హాలులో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే, ఎంపీ లు బండా ప్రకాశ్, సురేశ్ రెడ్డి, బడుగుల లింగయ్య, డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, మన్నే శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్ నేత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భారత ప్రధానమంత్రి పదవిని చేపట్టిన ఒకే ఒక్క తెలుగు వాడు… తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని నర్సంపేట మండలం లక్నేపల్లి లో 1921 జూన్ 28న పుట్టిన పివి సుదీర్ఘ రాజకీయ, ప్రజా జీవితాన్ని అనుభవించి, సంపూర్ణ జీవన సాఫల్యానికి సాధించి, 2004 డిసెంబర్ 23 న పరమపదించారన్నారు. పీవీ వరంగల్ లోనే చదువుకున్నా.. జర్నలిస్టు గా మొదలు పెట్టి, కాకతీయ పత్రిక నడిపి, బహు భాషలు నేర్చి, రాజకీయాల్లో చేరి, అనేక పదవులు అలంకరించారని తెలిపారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి పదవులు చేపట్టి ఆర్థిక సంస్కరణలు తెచ్చారు. దేశాన్ని కాపాడారని, దేశ రక్షణ కొరకు అణు పరీక్షల కార్యక్రమాన్ని మొదలు పెట్టింది పీవీ నరసింహారావు అని వివరించారు.

2020, జూన్ 28 నుండి 2021 జూన్ 28 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పీవీ శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించిందని, రాష్ట్రమే కాదు యావత్ దేశం, ప్రపంచంలోని 50 దేశాలలో ఈ ఉత్సవాలను నిర్వహించామన్నారు. పీవీకి భారత రత్న ఇవ్వాలని, వారి చిత్ర పటాన్ని పార్లమెంటులో పెట్టాలని కెసిఆర్ కేంద్రాన్ని కోరారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని, పీవీ పుట్టిన లక్నెపల్లి, పెరిగిన వoగర గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రణాలికలు సిద్దం చేసిందన్నారు.

Also Read :

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్