అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ‘ది ఘోస్ట్‘.ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. స్టైలీష్ యాక్షన్ ఫిల్మ్ గా రూపొందిన ఈ మూవీ దసరా కానుకగా రిలీజైంది కానీ.. ధియేటర్లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ది ఘోస్ట్ మూవీని ఓటీటీలో రిలీజ్ చేశారు. థియేటర్లో మెప్పించలేకపోయిన ఈ చిత్రం ఓటీటీలో మాత్రం అదరగొడుతుంది.
గత ఏడాది వైల్డ్ డాగ్ అనే థ్రిల్లర్ మూవీ మంచి టాక్ తెచ్చుకుని కూడా దారుణమైన వసూళ్లు రాబట్టింది. ఫుల్ రన్లో రూ.4 కోట్ల లోపు షేర్ కలెక్ట్ చేసి డిజాస్టర్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైతే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కొన్ని వారాల పాటు సినిమా టాప్‌లో ట్రెండ్ అయింది. వివిధ భాషల వాళ్లు ఆ సినిమాను గొప్పగా ఆదరించారు. ది ఘోస్ట్ ప్రమోషన్ల టైంలో నాగ్ ప్రత్యేకంగా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. కొవిడ్ వల్ల ఆ సినిమా అంతగా ఆడలేదని.. తర్వాత నెట్ ఫ్లిక్స్‌లో గొప్ప రెస్పాన్స్ తెచ్చుకుందని అన్నారు. ది ఘోస్ట్ ఖచ్చితంగా థియేటర్లలో మంచి ఫలితం అందుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు కానీ డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనిపించింది.
ది ఘోస్ట్ హిందీలో మొన్న సినిమా రిలీజైన దగ్గర్నుంచి నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతుండగా.. తెలుగు వెర్షన్ నాలుగో స్థానంలో ఉంది. ఇది చూసి నాగ్ బాక్సాఫీస్ కింగ్ కాదు.. నెట్ ఫ్లిక్స్ కింగ్ అంటూ నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. మరి.. నాగ్ మళ్ళీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ ఎప్పుడు సాధిస్తారో చూడాలి.