Sunday, January 19, 2025
HomeTrending Newsఏరా.. పోరా.. అనే పదాలు వాడొద్దు

ఏరా.. పోరా.. అనే పదాలు వాడొద్దు

ఇకపై పోలీసులు అమర్యాదగా, ఏరా… పోరా అనే పధాలు ఉపయోగించకూడదు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు వారితో ఇలా మాట్లాడడం తగదు అని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజలతో పోలీసులు సవ్యమైన భాషలోనే మాట్లాడాలని, వారితో అగౌరవంగా మాట్లాడకూడదని కేరళ డీజీపీ అనిల్ కాంత్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

తమ దగ్గరకు వచ్చిన వారి వద్ద `ఎడా`, `ఎడి` వంటి అగౌరవ పదాలను ఉపయోగించవద్దని సూచించారు. పోలీసుల ప్రవర్తనను అనుక్షణం గమనించేందుకు ప్రతి జిల్లాలోని ఓ స్పెషల్ బ్రాంచ్ పనిచేస్తుందని తెలిపారు. ప్రజలతో అగౌరవంగా మాట్లాడిన పోలీసులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

కేరళ హై కోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆయన తాజాగా ఈ ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు అసభ్యంగా  మాట్లాడారని ఓ వ్యక్తి కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఆ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ప్రజలతో సంభాషించేటపుడు పోలీసులు గౌరవంగా వ్యవహరించాలని వ్యాఖ్యానించింది. `ప్రజలతో మాట్లాడేటపుడు గౌరవంగా వ్యవహరించడం పోలీసులు నేర్చుకోవాలి. `ఎడా`, `ఎడి` వంటి పదాలతో ప్రజలను పిలిచే హక్కు పోలీసులకు లేదు. ప్రజలతో గౌరవంగా మాట్లాడాలని పోలీసులకు సూచిస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేయాల`ని కేరళ హైకోర్టు సూచించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్