Saturday, July 27, 2024
HomeTrending Newsపంజ్ షిర్ లోనే అహ్మద్ మసూద్

పంజ్ షిర్ లోనే అహ్మద్ మసూద్

పంజ్ షిర్ ఆక్రమించుకున్నామని తాలిబన్లు ఇప్పటికే ప్రకటించుకున్నారు. అయితే ఆఫ్ఘన్ రెసిస్టన్స్ ఫోర్సు నేత అహ్మద్ మసూద్ ఎక్కడ ఉన్నాడు అనేది ప్రశ్నార్థకంగా మారింది. అహ్మద్ మసూద్ టర్కీ వెళ్లిపోయాడని ఇప్పటివరకు పుకార్లు వచ్చాయి. మసూద్ ఎక్కడికి పోలేదని పంజ్ షిర్ లోయలోనే ఉన్నాడని ఆయన అనుచరవర్గం చెపుతోంది. వారి వాదనను ఇరాన్ కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ కూడా ద్రువీకరించింది. లోయలోని మారు మూల ప్రాంతంలో అనుచర వర్గంతో మసూద్ సురక్షితంగా ఉన్నాడని న్యూస్ ఏజెన్సీ వివరించింది.

పంజ్ షిర్ లో 70 శాతం ముఖ్యమైన ప్రాంతాలు తాలిబాన్ ల వశం అయినట్టు సమాచారం. పైకి ఆ విధంగా ఉన్నా లోయలో కార్యకలాపాలు ఇప్పటికి వివిధ తిరుగుబాటు వర్గాల అదుపు ఆజ్ఞల్లో సాగుతున్నాయని స్థానికులు చెపుతున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో తాలిబన్లపై తిరుగుబాటు చేసేందుకు తిరుగుబాటు దళాలు సిద్దంగా ఉన్నట్టు అంతర్జాతీయ మీడియా చెపుతోంది.

తాలిబాన్ వశం అయిందని వారు ప్రకటన చేశాక అహ్మద్ మసూద్ ఓ వీడియో విడుదల చేశాడు. తాలిబాన్ ఉగ్రవాడులది ఇప్పుడు పైచేయిగా ఉన్నా తొందరలోనే పంజ్ షిర్ స్వేచ్చా స్వాతంత్ర్యం సాధిస్తుందని స్పష్టం చేశారు.  తాలిబాన్ బలగాలు పంజ్ షిర్ విడిచి వెళితే తాము చర్చలకు సిద్దమని అహ్మద్ మసూద్ ఈ వీడియోలో  వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్