Monday, February 24, 2025
HomeTrending Newsఎనిమిదో నిజాం రాజు కన్నుమూత

ఎనిమిదో నిజాం రాజు కన్నుమూత

నిజాం రాజ్యంలో ఎనిమిదో రాజు అయిన  ముఖరం జా గత రాత్రి ఇస్తాంబుల్ లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని అయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.  నిన్న రాత్రి పదిన్నర గంటలకి  అయన మృతి చెందినట్లు ప్రకటించారు. ఆయన పూర్తి పేరు నవాబ్ మీర్ బర్కత్ అలీ ఖాన్ వలషాన్ ముఖరం జా బహదూర్.

తన అంత్యక్రియలు మాతృభూమి లో జరగాలన్న ముఖరం జా చివరి కోరికను గౌరవిస్తూ ఆయన భౌతిక కాయాన్ని 17న హైదరాబాద్ కు తీసుకు రానున్నట్లు కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలియజేశారు.  ప్రజల సందర్శనార్థం చౌమహల్లా  ప్యాలెస్ లో కాసేపు మృత దేహాన్ని ఉంచి అనంతరం అసఫ్ జాహీ కుటుంబ సభ్యుల సమాధుల మధ్య ముఖరం జా ను కూడా ఖననం చేస్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్