Saturday, November 23, 2024
HomeTrending Newsమావోయిస్టుల లొంగుబాటు

మావోయిస్టుల లొంగుబాటు

మావోయిస్టు పార్టీ వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి భారీ షాక్ తగిలింది. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ చర్ల మండల మిలీషియా సభ్యులు 14 మంది భద్రాద్రి జిల్లా ఎస్పీ మరియు  సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ అధికారుల ఎదుట లొంగిపోయారు. కొత్తగూడెంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో  ఎస్పీ సునీల్ దత్ ఈ రోజు వివరాలు వెల్లడించారు.

ఛత్తీస్ ఘడ్ సరిహద్దున గల చర్ల మండలంలోని ఎర్రంపాడు, రాళ్లపురం రామచంద్రపురం, కిష్టారంపాడు, కొరకట్ పాడు గ్రామాలకు చెందిన వీరంతా సిపిఐ మావోయిస్టు పార్టీ చర్ల ఏరియా కమిటీ కోసం పనిచేస్తున్నారు. మావోయిస్టు పార్టీ మీటింగులకు హాజరు కావాలని, రేషన్ పంపాలని నిత్యం నిర్బంధ వేధింపులు తాళలేక విసుగు చెందారు. లొంగిపోయిన వారిలో 13 మంది పురుషులు కాగా ఒక మహిళ ఉన్నారు.

నిత్యం భయబ్రాంతులతో, ప్రశాంత జీవితాన్ని కోల్పోయిన నేపథ్యంలో వీరంతా ప్రశాంత జీవితం గడపాలని లొంగిపోయినట్లు  జిల్లా ఎస్పీ వివరించారు. మావోయిస్టు పార్టీ నుండి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలనుకునే వారు వారి బంధువుల ద్వారా గాని స్థానిక పోలీస్ స్టేషన్లలో లొంగి పోవలసిందిగా పోలీసు ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్