చిత్రాల సీమలో విచిత్రాలు ఎన్నో జరుగుతుంటాయి. అలాంటిదే సెప్టెంబర్ 9న జరగబోతుంది. ఇంతకీ విషయం ఏంటంటే… నాగార్జున చాలా గ్యాప్ తర్వాత నటించిన బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్రం. ఇందులో రణ్ భీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. దర్శకధీరుడు రాజమౌళి ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తుండడం విశేషం.
ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా నాగార్జున పాత్రకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇది బాలీవుడ్ బాహుబలి అని నాగార్జున ఓ ప్రెస్ మీట్ లో చెప్పారు. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. శర్వనంద్ నటించిన ‘ఓకే ఒక జీవితం’రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.
తెలుగు, తమిళ్ లో రూపొందించిన ఈ మూవీలో అక్కినేని అమల కీలక పాత్ర పోషించారు. శర్వానంద్ సరసన రీతూ వర్మ నటించిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9న రిలీజ్ చేయనున్నారు. సో.. సెప్టెంబర్ 9న బాక్సాఫీస్ దగ్గర రెండు భాషల్లో నాగార్జున నటించిన బ్రహ్మాస్త్రం, అమల నటించిన ఒకే ఒక జీవితం చిత్రాలు పోటీపడనున్నాయి. మరి.. ఈ రెండు చిత్రాల్లో ఏ సినిమా విజయం సాధిస్తుందో చూడాలి.
Also Read : సెప్టెంబర్ 9న ‘ఒకే ఒక జీవితం’