National Farmer Products Policy :
పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రెండవరోజు మంగళ వారం టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఆధ్వర్యంలో నినాదాలు చేస్తూ… ధర్నా నిర్వహించారు లోక్ సభలో టిఆర్ఎస్ పార్టీ నేత నామా నాగేశ్వర రావు, రాజ్య సభ సభ్యులు సురేష్ రెడ్డి, బండా ప్రకాశ్, జోగినపల్లి సంతోష్ కుమార్, చేవెళ్ల లోక్ సభ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, బిబి పాటిల్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్ నేత,పసునూరి దయాకర్ తదితరులు ప్లకార్డులు పట్టుకొని తమ స్థానాల్లో బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కెసిఆర్ గారి ముందు చూపు వల్ల రైతులకు సమృద్ధిగా సాగునీరు, ఎరువులు, విత్తనాలు, రైతు బంధు వంటి పథకాలతోపాటు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు అందటం వల్ల దిగుబడులు పెరిగాయని, ఆ మేరకు ఎఫ్ సి ఐ కొనుగోళ్లను పెంచాల్సి ఉందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవడమే కాదు, రైతు సంక్షేమం కోసం అవసరమైన విధానాలను చేపట్టాలన్నారు. దేశానికి ఆదర్శవంతమైన రైతుకు ప్రయోజనం చేకూర్చే అనేక పథకాలు అమలు అవుతున్నాయని, అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం విధి, విధానాలను రూపొందించి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అప్పటి వరకు రైతుల కోసం తమ ఆందోళన, ఉద్యమం కొనసాగుతుందని వారు తెలిపారు.
Also Read : తెరాస ఎంపిల నిరసన