రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్లో ఈ భారీ మల్టీస్టారర్ రూపొందింది. 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించింది. అయితే.. ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలవబోతుందని విదేశీ మ్యాగజైన్స్ సైతం వార్తలు రాయడంతో ముఖ్యంగా తెలుగు సినీ అభిమానులు ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ అంటూ తెగ సంబరపడ్డారు.
అయితే.. ఆర్ఆర్ఆర్ కు షాక్ ఇచ్చి గుజరాతీ చిత్రం చెల్లో షోను ఇండియా తరుపున ఆస్కార్ కి పంపించారు. దీంతో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ సోషల్ మీడియాలో నిరసన తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో.. చెల్లో షో సినిమాకి ఉన్న అర్హతలేంటి.. ఆర్ఆర్ఆర్ చిత్రానికి లేనివి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే ఆరోపణలు చేసేవారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెలెక్షన్ కమిటీ అధ్యక్షుడు టీఎస్ నాగభరణ ఓ ఇంటర్వ్యూలో దీని పై స్పందించారు.
“ఆర్ఆర్ఆర్ మంచి సినిమానే ఆ మాటకొస్తే మొత్తం 13 చిత్రాలు కూడా దేనికవే మెరిట్ ఉన్న చిత్రాలు. అయితే.. ఒక్క సినిమాని మాత్రమే సెలెక్ట్ చెయ్యాలి కదా.. అందుకే చెల్లో షో ని ఆస్కార్ పరిశీలనకి పంపించాం” అని చెప్పారు. “చేలో షో కథలో కథనంలో అందరికీ నచ్చే మానవీయ కోణం ఉంది. అందుకే ఇతర సినిమాలను పక్కన పెట్టి ఈ చిత్రానికి 17 మంది జ్యూరీ సభ్యులం అందరం ఓటేశాం” అని టిఎస్ నాగాభరణ తెలిపారు. మరి.. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆలోచించినట్లు ఆస్కార్ కమిటీ పరిశీలిస్తుందో లేదో చూడాలి.
Also Read :