Sunday, January 19, 2025
HomeసినిమాSame Line: స్పై, డెవిల్ ఒకే కథతో వస్తున్నాయా?

Same Line: స్పై, డెవిల్ ఒకే కథతో వస్తున్నాయా?

నిఖిల్ ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ సాధించి సంచలనం సృష్టించాడు. తాజాగా ‘స్పై’ తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ చిత్రానికి ఎడిటర్ గ్యారీ దర్శకత్వం వహించారు. రీసెంట్ విడుదలైన టీజర్ ఇంట్రస్టింగ్ గా ఉండడంతో సినిమా సక్సెస్ పై మరింత నమ్మకం పెరిగింది. జూన్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అయితే.. స్పై టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ సినిమా కథ, కళ్యాణ్‌ రామ్ ‘డెవిల్’ స్టోరీ ఒకటే అనే టాక్ వినిపిస్తుంది.

విమాన ప్రమాదంలో చనిపోయినట్లు అందరూ భావించే నేతాజీ సుభాష్ చంద్రబోస్ విషయంలో అసలేం జరిగిందనే నేపథ్యంలో ఒక గూఢచారి చేసే సాహసాల నేపథ్యంలో స్పై చిత్రం తెరకెక్కింది. కథ మొత్తంలో బోస్ కీలకంగా ఉంటాడని టీజర్లో చెప్పకనే చెప్పేశారు. అయితే.. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న డెవిల్ కథ కూడా దాదాపుగా ఇలాగే ఉంటుందని అంటున్నారు. అయితే.. అది వర్తమానంలో నడిచే కథ కాదని.. పీరియడ్ ఫిల్మ్ అని చెబుతున్నారు. అందులో కూడా హీరో కళ్యాణ్ రామ్ గూఢచారే.. అక్కడ కూడా కథ సుభాష్ చంద్రబోస్ చుట్టూ తిరుగుతుందని సమాచారం.

ఇండస్ట్రీలో ఈ రెండు కథల పోలికల గురించి ఇప్పటికే పెద్ద చర్చ జరుగుతుంది. అయితే.. స్పైటీజర్ లాంచ్ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో నిఖిల్‌కు దీని గురించి అడిగితే.. డెవిల్ కు, తమ సినిమాకు సంబంధం లేదని తేల్చేశాడు. ఆ కథ వేరు.. ఈ కథ వేరు అన్నాడు. కళ్యాణ్‌ రామ్ డెవిల్ స్టోరీ ఏంటనేది తెలుసుకున్నాం. డెవిల్ కు స్పైకు సంబంధం లేదు అని చెప్పాడు కానీ ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఈ చర్చ ఆగట్లేదు. ముందు రిలీజయ్యేది స్పైనే కావడంతో దాని వల్ల డెవిల్ కు తలనొప్పి తప్పదని కామెంట్లు వస్తున్నాయి. మరి.. ఈ రెండు చిత్రాల్లో ఏ సినిమా ఆకట్టుకుంటుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్