మెగాస్టార్ చిరంజీవి ‘ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అఫ్ ఇండియా 2022 అవార్డును నేడు స్వీకరించారు. గోవాలో జరుగుతోన్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా 2022 ముగింపు వేడుకల్లో కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అనురాగ్ ఠాకూర్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ అవార్డును చిరంజీవికి ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ… తనకు యువ హీరోలు పోటీ కాదు. నేనే వాళ్లకు పోటీ అని… వాళ్లకు ఇప్పుడు చాలా కష్టకాలమే అంటూ వ్యాఖ్యానించారు. ఈ అవార్డు తనతో పాటు తన అభిమానుల్లోనూ ఎనలేని ఉత్సాహాన్ని నింపిందన్నారు. తనకు సరైన సమయంలోనే నాకు ఈ అవార్డు ఇచ్చారని భావిస్తున్నానని, ఈ క్షణం కోసం దశాబ్దాల నుంచి ఎదురుచూస్తున్నానంటూ భావోద్వేగంతో చెప్పారు.
గతంలో జరిగిన చలన చిత్రోత్సవ వేడుకలకు ఒకసారి వచ్చానని, ఆ సమయంలో దక్షిణాదికి చెందిన ఒక్క నటుడి ఫోటో లేదని చాలా బాధపడ్డానని చిరు ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ఎక్కడైనా తీయొచ్చు, కానీ అది భారతీయ సినిమా అని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఇప్పుడు ప్రాంతీయ బేధాలు పోయి భారతీయ సినిమా అనే రోజు వచ్చిందని తన ప్రసంగంలో పేర్కొన్నారు.
సినీ నటుడు అక్షయ్ కుమార్ కూడా ఈ ముగింపు ఉత్సవంలో పాల్గొన్నారు.
Also Read : Chiranjeevi: మెగాస్టార్ కు అరుదైన పురస్కారం