Sunday, January 19, 2025
HomeసినిమాSukku Next: సుకుమార్ నెక్ట్స్ మూవీ ఎవరితో?

Sukku Next: సుకుమార్ నెక్ట్స్ మూవీ ఎవరితో?

‘ఆర్య’ తో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన సుకుమార్ ఇప్పటివరకు ఎన్నో విభిన్న కథాచిత్రాలు అందించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.  ‘పుష్ప’ తో పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు.  ఇది తెలుగులోకంటే హిందీలో బాగా సక్సెస్ అవ్వడంతో ‘పుష్ప 2’ పై బాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదల చేసిన ‘పుష్ప 2’ గ్లింప్స్ కు నార్త్ లో అనూహ్య స్పందన వచ్చింది. తక్కువ టైమ్ లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించడం విశేషం.

అయితే.. పుష్ప 2 తర్వాత సుకుమార్ నెక్ట్స్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా అని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. లైగర్ ఫ్లాప్ అయినప్పటి నుంచి విజయ్, సుక్కు మూవీ లేదని టాక్ వినిపించింది. ఈ వార్త వైరల్ అవ్వడంతో విజయ్ దేవరకొండ టీమ్ మెంబర్స్ అలాంటిది ఏమీ లేదు.. సుకుమార్ తో విజయ్ సినిమా ఉందని తెలియచేశారు. మరో వైపు ప్రభాస్ కోసం సుకుమార్ ఓ సినిమా ప్లానింగ్ లో ఉన్నారని తెలిసింది. ఈ భారీ పాన్ ఇండియా మూవీని దిల్ రాజు నిర్మించనున్నారని సమాచారం.

సుకుమార్ లిస్ట్ లో మహేష్‌ బాబు కూడా ఉన్నాడని తెలిసింది. పుష్ప కంటే ముందే మహేష్‌ బాబుతో సినిమా చేయాలనుకున్నాడు కానీ.. వారిద్దరి మధ్య కథకు సంబంధించి బేధాభిప్రాయలు రావడంతో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. మహేష్‌ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నారు. ఆతర్వాత రాజమౌళితో సినిమా చేయనున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్ తో మహేష్ మూవీ ఉంటుందని ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. 1 నేనొక్కడినే సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మహేష్ తో అందరికీ కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీ చేస్తానని… బ్లాక్ బస్టర్ ఇస్తానని సుకుమార్ చెప్పారు. మరి.. నిజంగానే ఈ క్రేజీ కాంబో సెట్ అవుతుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్