Sunday, November 24, 2024
HomeTrending Newsఇస్తున్నది గోరంత ప్రచారం కొండంత: అచ్చెన్న

ఇస్తున్నది గోరంత ప్రచారం కొండంత: అచ్చెన్న

ఈ ప్రభుత్వం అందిస్తున్నది  విద్యా దీవెన కాదని దగా దీవెన అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.  దాదాపు  5 లక్షల మంది విద్యార్ధులకు ఈ పథకంలో కోత విధించారన్నారు. కానీ దీని ప్రచారానికి మాత్రం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు.  దీనిపై అయన ఓ ప్రకటన విడుదల చేశారు.

అచ్చెన్నాయుడు ప్రకటనలో ముఖ్యాంశాలు

  • టీడీపీ ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్ధులకు ఫీజ్ రీఎంబర్స్ మెంట్ అందిచింది
  • ఈ ప్రభుత్వం కేవలం 11 లక్షల మందికి  విడతల వారీగా అందిస్తోంది
  • గోరంత ఇచ్చి కొండంత ప్రచారం చేసుకుంటున్నారు
  • ఏటా నాలుగు విడతలుగా ఇస్తామని  ప్రకటించి మూడు విడతలు మాత్రమే  ఇచ్చి నాలుగోది ఎగ్గొడుతున్నారు
  • 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి 4వ క్వార్టర్‌ నగదు ఇప్పటికీ విడుదల చేయకపోవడంతో పరీక్షలు రాయనీయబోమని విద్యార్ధులకు తాఖీదు ఇస్తున్నారు.
  • విద్యా దీవెనపై  ఏడాదికి రూ.20 కోట్లు చొప్పున 5 ఏళ్లకు రూ.100 కోట్లు  ప్రచారానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
  • 2018-19లో టీడీపీ ప్రభుత్వం 3,47,567 మంది ఎస్పీ విద్యార్ధులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ ఇచ్చింది
  • 2021-21లో జగన్ ప్రభుత్వం కేవలం 2,15,852 మందికే ఇస్తూ వెనకబడిన వర్గాలకు విద్యను దూరం చేశారు.
  • జీవో నెం.77 ద్వారా ప్రైవేట్‌, ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ కళాశాలల్లో చదివే  పీజీ విద్యార్థులకు విద్యాదీవెన నిలిపివేసి బడుగు బలహీన వర్గాలకు ఉన్నత చదువులను దూరం చేశారు.
  • జగన్ ప్రభుత్వ అనాలోచిత, అవగాహనా రాహిత్య నిర్ణయాలతో మూడున్నరేళ్ల పాలనలో విద్యారంగాన్ని భ్రష్టుపట్టించారు
RELATED ARTICLES

Most Popular

న్యూస్