పల్లె నుంచి నగరం వరకు అన్ని ఎన్నికల్లోనూ జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి పి. అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నేటి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు గత పంచాయతీ, మున్సిపల్ ఫలితాలకు మించి ప్రజాభిమానాన్ని ప్రతిఫలించేలా ఉన్నాయని వెల్లడించారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడిన ముఖ్యాంశాలు
⦿ రెండేళ్ళ జగన్ పరిపాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది
⦿ పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టి, ప్రచారం చేశాక, డిపాజిట్లు కూడా రావని చేతులెత్తేసి పారిపోయింది టిడిపి
⦿ ఏ సామాజికవర్గమైనా టీడీపీతో ఎందుకు ఉంటారు…?
⦿ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న వైఎస్ జగన్ వెంటే ప్రజలు ఎప్పటికీ ఉంటారు
⦿ అయ్యన్నపాత్రుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే.. పాత్ర పగిలిపోతుంది
⦿ జగన్ మోహన్ రెడ్డిగారు నిజంగా కన్నెర్ర చేస్తే.. మీరు తిరగగలుగుతారా..?
⦿ అన్ని జిల్లా పరిషత్ లు, 90 శాతంకు పైగా మండల పరిషత్ లను వైయస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది
⦿ టీడీపీకి ఉన్న 19 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఎన్నికలకు వెళదాం.. ప్రజలు ఎవరి పక్షమో తేలుతుంది
⦿ ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే టీడీపీ ఎన్నికల బహిష్కరణ అంటూ డ్రామా ఆడింది
⦿ చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు నారా లోకేష్ కేవలం హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు.