Sunday, January 19, 2025
HomeTrending Newsతొర్రూరు ప్లాట్ల కొనుగోలుకు పోటా పోటీ

తొర్రూరు ప్లాట్ల కొనుగోలుకు పోటా పోటీ

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్​ ​ మండలం తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో హైదరాబాద్​ మెట్రో పాలిటన్​ డెవలప్​ మెంట్​ అథారిటీ(హెచ్ఎండిఏ) రూపొందించిన ‘‘తొర్రూర్​ లే అవుట్’’​ లో ప్లాట్లు హాట్​ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.

రెండో దఫా 140 ప్లాట్లను వరుసగా మూడు రోజుల పాటు ఆన్​ లైన్​ వేలం ద్వారా హెచ్ఎండిఏ విక్రయించనుంది.

ఆన్​ లైన్​ వేలం ప్రక్రియలో భాగంగా శుక్రవారం రెండు సెషన్లలో 42 ప్లాట్ల కు జరిగిన ఆన్​ లైన్​ వేలంలో 41 ప్లాట్లకు కొనుగోలుకు ఔత్సాహికులు పోటీ పడ్డారు.

మార్నింగ్​ సెషన్​లో అత్యధికంగా గజం రూ.33,000లు ధరకు పలుకగా, అత్యల్పంగా గజం రూ.23,000లు పలికింది.

ఈవినింగ్​ సెషన్​ లో అత్యధికంగా గజం రూ.35,500లు బిడ్​ చేయగా, అత్యల్పంగా గజం రూ.21,000లకు ధర పలికింది.

శుక్రవారం రూ.33.58 కోట్ల విలువజేసే 41 ప్లాట్లు ఆన్​ లైన్​ వేలం ద్వారా అమ్మకాలు జరిగాయి. మిగతా 106 ప్లాట్ల కు శనివారం, తిరిగి సోమవారం ఆన్​ లైన్​ వేలం ద్వారా బిడ్డింగ్​ జరుగనున్నది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్