Thursday, November 21, 2024
HomeTrending Newsభారత విద్యార్థులకు వ్యాక్సిన్ చిక్కులు

భారత విద్యార్థులకు వ్యాక్సిన్ చిక్కులు

భారతదేశం నుంచి అమెరికా వెళ్ళే విద్యార్థులకు ఆ దేశ విశ్వ విద్యాలయాలు కొత్త మార్గ దర్శకాలు ప్రకటించాయి. భారత బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్, రష్యా స్పుత్నిక్  వి వ్యాక్సిన్ తీసుకున్న విద్యార్థులు తిరిగి ప్రపంచ ఆరోగ్య సంస్థ(W.H.O) గుర్తించిన టీకా వేసుకోవాలని సూచించాయి. కాలేజీ క్యాంపస్ రావాలంటే టీకా నిభందనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనని 400 కాలేజీలు, విశ్వ విద్యాలయాలు స్పష్టం చేశాయి.

అమెరికాకు ఉన్నత విద్య కోసం ఇండియా నుంచి వెళ్ళే విద్యార్థులు తప్పనిసరిగా W.H.O. గుర్తించిన వ్యాక్సిన్ తీసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పటికే తీసుకున్నవారు మరో టీకా తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఉత్పన్నం అవుతాయనే అంశంపై తమ వద్ద సమాచారం లేదని అమెరికా ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. W.H.O. గుర్తించని టీకా తీసుకున్న వారు 28 రోజుల వ్యవధి తర్వాత మరో వ్యాక్సిన్ వేయించుకోవాలని అమెరికా ఆరోగ్య శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఫైజేర్, మోడేర్ణ, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలు అమెరికా లో అందుబాటులో ఉన్నాయి.

విశ్వ విద్యాలయాలు వ్యాక్సిన్ విషయంలో ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నాయని అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎడ్యుకేషన్ ఉపాధ్యక్షుడు టెర్రీ హర్ట్లే పెదవి విరిచారు. ప్రపంచ దేశాల నుంచి విద్యార్థుల్ని ఆహ్వానిస్తూ ఉన్నత విద్య కోసం వారి దగ్గర ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలు ఇలాంటి విషయాల్లో కనికరం లేకుండా వ్యవహరించటం తగదని ఆయన హితవు పలికారు.

అమెరికన్ కాలేజీల టీకా నిభందనలు అందరికన్నా భారత విద్యార్థులకే ఇబ్బందికరంగా పరిణమించాయి.  ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఇండియా నుంచి అమెరికా వెళ్తున్నారు. వ్యాక్సిన్ అపాయింట్మెంట్ వ్యవహారం కూడా అనేక నిభందనలతో చాలా ఇబ్బందికరంగా ఉందని భారతీయ విద్యార్థులు ఆందోళనగా ఉన్నారు.  ఇంత పెద్ద సంఖ్యలో చేరుకునే విద్యార్థులకు వ్యాక్సిన్ ఇవ్వటం పెద్ద ప్రహాసనం అవుతుందని అక్కడి భారతీయ సంఘాలు అంటున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్