Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్విలియమ్సన్ స్థానంలో సౌతీ

విలియమ్సన్ స్థానంలో సౌతీ

Tim Southee To Lead The New Zealand For T20 Series With Team India :

ఇండియాతో జరిగే మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ నుంచి కేన్ విలియమ్సన్ వైదొలిగాడు. కేన్ స్థానంలో టిమ్ సౌతీ సారధ్యం వహించనున్నాడు. రెండ్రోజుల క్రితం దుబాయ్ లో ముగిసిన టి20 వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన న్యూజిలాండ్ మూడు 20 మ్యాచ్ లు, రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇండియా చేరుకుంది.

రేపు బుధవారం (నవంబర్ 17)నాడు జైపూర్ లో తొలి మ్యాచ్ జరగనుంది ఆ తర్వాత 19న రాంచీలో, 21న కోల్ కతాలో టి 20 మ్యాచ్ లు జరుగుతాయి. నవంబర్ 25 నుంచి 29 వరకు కాన్పూర్ లో తొలి టెస్ట్, డిసెంబర్ 03 నుంచి 05 వరకు ముంబై లో రెండో టెస్ట్ మ్యాచ్ లు జరగనున్నాయి.

‘కాన్పూర్ లో మొదలయ్యే మొదటి టెస్ట్ మ్యాచ్ కు సన్నద్ధం అయ్యేందుకు గాను కేన్ విలియమ్సన్ ఈ వారంలో జరిగే మూడు మ్యాచ్ ల టి 20 సిరీస్ లో ఆడబోవడం లేదు’ అని న్యూ జిలాండ్ క్రికెట్ ఓ ప్రకటనలో వెల్లడించింది. సౌతీ తో పాటు, కైల్ జేమిసన్, డేరిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్  లు టి 20 తో పాటు టెస్ట్ సిరీస్ కు కూడా అందుబాటులో ఉంటారు. గాయంతో బాధపడుతున్న ఫెర్గ్యుసన్ కూడా అందుబాటులోకి వస్తాడని న్యూ జిల్యాండ్ క్రికెట్ పేర్కొంది.

Also Read :  ఘనంగా క్రీడా అవార్డుల ప్రదానం

RELATED ARTICLES

Most Popular

న్యూస్