Wednesday, April 9, 2025
Homeసినిమా‘కృష్ణ వ్రింద విహారి' టైటిల్ సాంగ్ విడుదల

‘కృష్ణ వ్రింద విహారి’ టైటిల్ సాంగ్ విడుదల

నాగశౌర్య హీరోగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి‘. దీనిలో రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో నాగ శౌర్య కనిపించనున్నాడు. బ్రాహ్మణ కుర్రాడిగా, ఉద్యోగం మీద నగరానికి వచ్చిన తర్వాత అర్బన్ కుర్రాడిగా అలరించనున్నాడు. ట్రైలర్‌ లో తన నటనతో అదరగొట్టాడు నాగశౌర్య. ఈరోజు చిత్ర బృందం టైటిల్ సాంగ్‌ని లాంచ్ చేసింది.
ఈ పాటలో నాగ శౌర్య ఒక ఇరకాట పరిస్థితిలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. అతని ప్రేమలో సమస్యతో పాటు కుటుంబంతో కూడా చిక్కొచ్చింది. అంతేకాకుండా వెన్నెల కిషోర్ కోమా నుండి మేల్కొలపడానికి ఎదురు చూస్తున్నాడు నాగ శౌర్య.

 మహతి స్వర సాగర్ సంగీతం అందించగా, రామ్ మిరియాల ఎనర్జిటిక్ గా పాడారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం ఆకట్టుకుంది. ఐరా క్రియేషన్స్ పతాకం పై ఉషా ముల్పూరి నిర్మించిన చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. శౌర్య తల్లిగా అలనాటి నటి రాధిక శరత్‌కుమార్ కనిపించనున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్న ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటర్. ‘కృష్ణ వ్రింద విహారి’ సెప్టెంబర్ 23న విడుదల కానుంది.

Also Read : నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి టీమ్ పాదయాత్ర

RELATED ARTICLES

Most Popular

న్యూస్