Sunday, January 19, 2025
Homeసినిమాఎన్టీఆర్ మూవీలో క్రేజీ హీరోయిన్..?

ఎన్టీఆర్ మూవీలో క్రేజీ హీరోయిన్..?

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఎప్పటి నుంచో వార్తల్లో ఉన్న ఈ సినిమా ఈమధ్య సెట్స్ పైకి వచ్చింది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ సినిమా పై మరింత క్రేజ్ ఏర్పడింది. ఇందులో ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. విలన్ గా సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నారు. రామోజీ ఫిలింసిటీలో ఎన్టీఆర్, సైఫ్ ఆలీఖాన్ ల పై యాక్షన్ సీన్స్ చిత్రీకరించారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ కంప్లీట్ అవ్వడంతో ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లారు. వచ్చిన తర్వాత తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు.

అయితే.. ఈ సినిమాలో జాన్వీ కపూర్ తో పాటు మరో హీరోయిన్ కూడా నటింనుందని వార్తలు వస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు ఫిదా బ్యూటీ సాయిపల్లవి అని టాక్ వినిపించింది. ఇప్పుడు మరో హీరోయిన్ కృతి శెట్టి పేరు కూడా వినిపిస్తుంది. దీంతో ప్రచారంలో ఉన్నట్టుగా ఈ భారీ పాన్ ఇండియా మూవీలో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఉందా..? ఉంటే.. ఆ పాత్రను సాయిపల్లవి చేయనుందా..? కృతి శెట్టి చేయనుందా..? అనేది ఆసక్తిగా మారింది. మరి.. ప్రచారంలో ఉన్న వార్తల పై మేకర్స్ త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్