Sunday, January 19, 2025
HomeసినిమాBalakrishna vs Ravi Teja: బాలయ్య వెర్సెస్ రవితేజ

Balakrishna vs Ravi Teja: బాలయ్య వెర్సెస్ రవితేజ

బాలకృష్ణ అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆతర్వాత ఆ సక్సెస్ ను కంటిన్యూ చేస్తూ వీరసింహారెడ్డి సినిమాతో మరో సక్సెస్ సాధించారు. ఇలా వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ సాధించడంతో ప్రస్తుతం అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుంటే.. కూతురుగా శ్రీలీల నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని దసరాకి విడుదల చేయాలి అనుకుంటున్నారు. ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ సాధిస్తారని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

ఇక రవితేజ ధమాకా సినిమాతో సక్సెస్ సాధించి మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ఆతర్వాత ఈ సక్సెస్ ని వాల్తేరు వీరయ్యతో కంటిన్యూ చేశారు. ధమాకా, వాల్తేరు వీరయ్య.. ఇలా వరుసగా సక్సెస్ సాధించిన రవితేజ ‘రావణాసుర’ సినిమాతో మాత్రం మళ్లీ ఫ్లాప్ చూడాల్సివచ్చింది. ఇప్పుడు రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రేణుదేశాయ్ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ మూవీ పోస్టర్ ను ఇటీవల రిలీజ్ చేశారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. దీంతో టైగర్ నాగేశ్వరరావు పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దసరాకి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు బాలయ్య, రవితేజ పోటీపడుతుండడం ఆసక్తిగా మారింది. బాలకృష్ణ రవితేజ ఇప్పటి వరకు మూడు సార్లు బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డారు. 2008లో బాలకృష్ణ ఒక్క మగాడు, రవితేజ కృష్ణ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఒక్క మగాడు బాలయ్య కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది. ఇక కృష్ణ మూవీ రవితేజకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. తర్వాత 2009లో బాలకృష్ణ మిత్రుడు మూవీతో రాగా రవితేజ కిక్ సినిమాతో ఒకేసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ రెండింటిలో కిక్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 2011లో సంక్రాంతిలో బాలకృష్ణ పరమవీరచక్ర మూవీతో వస్తే.. రవితేజ మిరపకాయ్ సినిమాతో సందడి చేశాడు. ఈసారి కూడా పోటీలో రవితేజని విన్ అయ్యాడు. ఇలా మూడు సార్లు ఇద్దరు తమ సినిమాలతో పోటీ పడితే రవితేజనే విన్నర్ గా నిలిచాడు. ఇప్పుడు ఈ దసరాకి రవితేజ టైగర్ నాగేశ్వరరావుతో రాబోతుంటే.. బాలకృష్ణ ‘ఎన్బికె 108’ చిత్రంతో వస్తున్నాడు. మరి.. ఈసారి  ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్