Wednesday, March 12, 2025
HomeసినిమాVimanam: ఎమోషన్ పాళ్లు ఎక్కువైన 'విమానం'

Vimanam: ఎమోషన్ పాళ్లు ఎక్కువైన ‘విమానం’

Mini Review: ఈ వారం థియేటర్స్ కి వచ్చిన సినిమాల్లో ‘విమానం’ ఒకటి. సముద్రఖని .. అతని కొడుకు పాత్రను పోషించిన మాస్టర్ ధృవన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మిగతా పాత్రల్లో రాహుల్ రామకృష్ణ … అనసూయ .. ధన్ రాజ్ కనిపిస్తారు. శివప్రసాద్ యానాల ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో స్టార్ హీరోగానీ .. హీరోయిన్ గా ని కనిపించరు. ఎందుకంటే ఇది కంటెంట్ పై నమ్మకంతో వచ్చిన సినిమా .. ఇందులో కథనే హీరో. పాత్రలన్నీ తమదైన దారిలో నడుస్తూ ఉంటాయి.

తమ కోరిక నెరవేరకపోతే పిల్లలు ఎంత బాధపడతారో .. ఆ కోరికను తీర్చలేకపోయినందుకు ఆ తల్లిదండ్రులు అంతకంటే ఎక్కువగా బాధపడతారు’ అని ఆ మధ్య ఒక స్టేజ్ పై త్రివిక్రమ్ చెప్పిన మాట .. ఈ సినిమా చూస్తుంటే గుర్తుకు వస్తుంది. విమానం ఎక్కాలనే తన కొడుకు కోరికను నెరవేర్చడం కోసం ఒక తండ్రి పడే కష్టం .. ఆ కోరిక .. చివరి కోరిక అని తెలిసినప్పుడు పడే ఆవేదన ప్రేక్షకుల మనసులను భారం చేస్తుంది. కాసేపు ఏసీలో కూర్చోవచ్చని థియేటర్స్ లో దూరినవారికి ఎమోషన్స్ ఎక్కువైపోయి ఇబ్బందిపడతారు.

చిన్నపిల్లల పాత్రలకి జబ్బు చేయడం .. ఇంటికి దీపం లాంటి పిల్లలు బాధపడుతుంటే పేరెంట్స్ అల్లాడిపోవడం .. నిస్సహయ స్థితిలో రోదించడం వంటి కథలు గతంలో చాలానే వచ్చాయి. అయితే ఇప్పటి ఆడియన్స్ అంత ఎమోషన్ ను తట్టుకునే పరిస్థితి లేదు. అక్కడక్కడా ఎమోషన్ పలకరించి వెళుతుంటే ఓకే .. కానీ ఒక బలమైన ఎమోషన్ అనే గుంజకు క్లైమాక్స్ వరకూ కట్టేయాలని చూస్తే తట్టుకోవడం కష్టం. ప్రధానమైన పాత్ర కష్టాలపై కష్టాలు పడుతూ పోతుంటే, ఎమోషన్స్ కి ఇంతలా దొరికిపోయామేంట్రా బాబూ అనిపిస్తుంది. బలమైన ఎమోషన్స్ ను తట్టుకునే మనసున్నవారు మాత్రం కథతో ట్రావెల్ చేయగలుగుతారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్