Saturday, January 18, 2025
HomeTrending News ట్రాన్క్ కో పటిష్టంగా ఉండాలి: పెద్దిరెడ్డి

 ట్రాన్క్ కో పటిష్టంగా ఉండాలి: పెద్దిరెడ్డి

Be effective: ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను అందించాలంటే ఏపి ట్రాన్స్ కో సమర్ధవంతంగా పని చేయాలని, పటిష్టంగా ఉండాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సచివాలయంలోని మూడో బ్లాక్ లో విద్యుత్ ట్రాన్స్ కో అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ డిస్కంలకు విద్యుత్ ను సరఫరా చేయడంలో ట్రాన్క్ కో సమర్థవంతమైన నెట్ వర్క్ తో పనిచేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్క్ కో ఆధ్వర్యంలో నూతన విద్యుత్ లైన్లు ఏర్పాటు, పంపిణీ వ్యవస్థలో భాగంగా సబ్ స్టేషన్ల నిర్మాణం, డెడికేటెడ్ కేబుల్స్, టవర్స్ నిర్మాణం పనులను వేగవంతం చేయాలని కోరారు.

రాష్ట్ర వ్యాప్తంగా 400 కెవి సామర్థ్యం కలిగిన 16 సబ్ స్టేషన్లు, 220 కెవి సామర్థ్యం ఉన్న 103 సబ్ స్టేషన్లు, 132 కెవి సామర్థ్యం ఉన్న 232 సబ్ స్టేషన్లు ఉన్నాయని, వాటి ద్వారా డిస్కం లకు విద్యుత్ సరఫరా జరుగుతోందని అన్నారు. మొత్తంగా 351 సబ్ స్టేషన్ల ద్వారా ట్రాన్క్ కో నుంచి డిస్కంలకు విద్యుత్ సరఫరా జరుగుతోందని తెలిపారు. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు రూ.223.47 కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు.

గ్రీన్ ఎనర్జీ కారిడార్ కోసం రూ.941.12 కోట్లతో, విశాఖపట్నం-చెన్నై కారిడార్ లో రూ.605.56 కోట్ల మేర పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. మూడు జోన్ లలో సిస్టమ్ ఇంప్రూవె మెంట్ లో భాగంగా రూ.762.53 కోట్లు కేటాయించామని వివరించారు. అలాగే 400 కెవి సామర్థ్యంతో కూడిన విద్యుత్ సరఫరా కోసం రూ.1257.56 కోట్లతో పనులు మొదలు పెట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రూ.3897.42 కోట్లతో ట్రాన్స్ కో ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఆయా పనులకు సంబంధించి ప్రతిఏటా ఎస్ఎస్ఆర్ రేట్లపై రివిజన్ జరగాలని సూచించారు. ఇందుకోసం వెంటనే కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. అంతేకాకుండా ట్రాన్స్ కో చేపట్టిన పనులకు గాన అటవీశాఖ క్లియరెన్స్ ల కోసం పనుల్లో ఎటువంటి జాప్యం లేకుండా నోడల్ ఆఫీసర్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇఎపి కింద చేపట్టిన ప్రాజెక్ట్ లను సకాలంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేయాలని కోరారు.

నిధుల లభ్యత, పనుల పురోగతిలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఓవర్ లోడింగ్, లో ఓల్టేజీ సమస్యలను పూర్తిస్థాయిలో నియంత్రించాలని, దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్, ట్రాన్స్ కో జెఎండి ఐ. పృథ్వితేజ్,  డిప్యూటీ సెక్రటరీ కుమార్ రెడ్డి, ట్రాన్స్ కో డైరెక్టర్ (ఫైనాన్స్) కె.ముత్తుపాండ్యన్, డైరెక్టర్ (గ్రిడ్ ట్రాన్స్ మిషన్ మేనేజ్ మెంట్) ఎకెవి భాస్కర్, ఇతర సిఇ, ఎస్ఇలు పాల్గొన్నారు.

Also Read : విద్యుత్ కొరత త్వరలో అధిగమిస్తాం: పెద్దిరెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్