Sunday, January 19, 2025
HomeTrending Newsఅసాంఘీక శక్తులకు రారాజు చంద్రబాబు

అసాంఘీక శక్తులకు రారాజు చంద్రబాబు

టీడీపీ హయాంలో చంద్రబాబే మాదక ద్రవ్యాల వ్యాపారం చేశాడని.. గంజాయి వ్యాపారంలో లోకేష్ పాత్ర ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి ఢిల్లీ లో ఆరోపించారు. ఏపీలో ఎవరి ప్రభుత్వంలో మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం దేశవ్యాప్తంగా విస్తరించిందో, ఎవరు ఈ వ్యాపారాన్ని ప్రోత్సహించారో అర్థం అవుతుందన్నారు.

విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…

చంద్రబాబు ఢిల్లీ పర్యటన పేరుతో ఆంధ్రప్రదేశ్ లో నానా హడావుడి చేసి, చివరికి రాష్ట్రపతిని మొక్కుబడిగా కలిసి ఎలా వెనుదిరిగిపోయాడో అంతా చూశారు. “అసలు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి ఎందుకు రావాల్సి వచ్చింది..? రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికేమైనా వచ్చాడా..? తన స్వప్రయోజనాలను కాపాడుకోవడానికి వచ్చాడా.. ? లేక ఢిల్లీకి వచ్చి రాష్ట్ర పరువును తీశాను అని ఏపీకి వెళ్ళి చెప్పుకోవడానికి వచ్చాడా..?  ఢిల్లీలో వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడానికి వచ్చాడా..? తాను తప్పు చేసి.. తప్పు చేయలేదు అని ఢిల్లీ నాయకులకు చెప్పుకోవడానికి వచ్చాడా..?”  అన్నది ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు.

 చంద్రబాబు గతంలో కూడా పలు సందర్భాల్లో ఢిల్లీ పర్యటనలకు వచ్చాడు. వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవాలంటే..

  1. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి దించినప్పుడు..
  2. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ఏసీబీకి దొరికిపోయి ఢిల్లీకి వచ్చి మొరపెట్టుకున్నప్పుడు..
  3. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో హిందీలో వాడే బోషడీకే పదాన్ని, ఆంగ్లంలో అయితే బాస్టర్డ్ అని అర్థం వచ్చే పదాన్ని తన పార్టీ అధికార ప్రతినిధులతో తిట్టించి, దాన్ని సమర్థించుకోవడానికి చంద్రబాబు ఢిల్లీ వచ్చాడు.

కుట్రలు చేయడం, ఆ కుట్రలను కప్పిపుచ్చుకోవడానికి ఢిల్లీ యాత్రలు చేయడమనేది చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు రాజకీయ రంగులేమిటి(ట్రూ కలర్స్) అన్నది ఇప్పటికే దేశంలో ఉన్న అన్ని పార్టీలకు, కేంద్రంలోని పెద్దలకు తెలిసిపోయింది. కాబట్టి, చంద్రబాబును ఢిల్లీలో ఎవరూ పట్టించుకోలేదు. ఆయనను కలవడానికి కేంద్ర హోం మంత్రిగానీ, ఇతర పార్టీల పెద్దలుగానీ ఎవరూ ఆసక్తి చూపలేదు. దాంతో వచ్చిన దారినే చంద్రబాబు వెనుదిరిగిన పరిస్థితి.

రాష్ట్రపతిని కలిసిన చంద్రబాబు ఆయనకు ఏం చెప్పాడు.  ” మా పార్టీ అధికార  ప్రతినిధి గౌరవ ముఖ్యమంత్రిని ఉద్దేశించి బోషడీకే అని అన్నాడని చెప్పాడా.. లేక, ఆ పదానికి చాలా మంచి అర్థం ఉందని చెప్పాడా.. లేక మా పార్టీ వాళ్ళ చేత బూతులు తిట్టించి, 36 గంటలపాటు బూతుల సమర్థన దీక్ష పెట్టి, ప్రజల కోసం, దేశం కోసం దీక్ష చేశానని చెప్పుకోవడానికి వచ్చాడా..? ” అన్నది రాష్ట్ర  ప్రజలకు ఎందుకు చంద్రబాబు చెప్పలేదు.

ప్రధాన మంత్రిమోడీని గతంలో మీరు, మీ పార్టీ నాయకులు తిట్టినటువంటి వీడియోల సీడీని, అమిత్ షా తిరుపతి వచ్చినప్పుడు ఆయన కుటుంబం మీద రాళ్ళు వేసిన వీడియోల సీడీలను రాష్ట్రపతికి చూపించారా..?

టీడీపీ ప్రభుత్వ హయాంలో తన సహచర మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు గంజాయిపై ప్రెస్ మీట్లు పెట్టి, ఏపీ నుంచే దేశం మొత్తం గంజాయి వెళుతుందని, గంజాయికి కేంద్రంగా మారిందని మాట్లాడిన వీడియోలు చూపించారా.. ? లేక తన పార్టీ అధికార  ప్రతినిధి పట్టాభి చేత ముఖ్యమంత్రిని తిట్టించిన వీడియోలను రాష్ట్రపతికి చూపించాడా..?

ఢిల్లీకి వచ్చి చంద్రబాబు నాయుడు చేసిన ప్రధాన ఆరోపణః గవర్నమెంటు స్పాన్సర్డ్ టెర్రరిజం అని, రాష్ట్రంలో 356 ఆర్టికల్ ను ప్రయోగించమని.

తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి.. ఎన్టీఆర్ చనిపోయేంతవరకు, ప్రతి మహానాడులో కూడా ఆర్టికల్ 356ను రద్దు  చేయాలని ప్రతిసారీ తీర్మానం చేస్తూ వచ్చారు. ఎన్టీఆరే మాకు స్ఫూర్తి అంటూ ఆయనకు దండలు వేసే చంద్రబాబు.. అదే ఆర్టికల్ ను  ప్రయోగించమని కోరటం అంటే దానిని టీడీపీ అనాలా.. లేక ఇంకేమైనా అనాలా? విధానాలు, సిద్ధాంతాలు లేని అదొక రాజకీయ పార్టీయేనా..?

చంద్రబాబే పెద్ద టెర్రరిస్టు. అసాంఘీక శక్తులకు రారాజు చంద్రబాబు నాయుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. టెర్రరిస్టు ముసుగు వేసుకున్న వ్యక్తి. అండర్ లైన్ చేసి చెబుతున్నా.. చంద్రబాబే టెర్రిరిస్టు. ఆ విషయం ఆయన స్టేట్ మెంట్స్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు. రౌడీ ఎలిమెంట్స్ కు, టెర్రరిస్టు అవుట్ ఫిట్స్ కు నాయకుడు చంద్రబాబు అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.

చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముఖ్య ఉద్దేశం ఏంటంటే..

                జగన్ గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పూర్ లైట్ లో అంటే తక్కువ  చేసి చూపించడం..

                బూతు మాటలతో తన  పార్టీ ప్రతినిధులతో ముఖ్యమంత్రిగారిని తిట్టించి.. రాష్ట్రంలో అలజడి సృష్టించి, ప్రజల మధ్య చిచ్చు రేపి, శాంతి భద్రతల సమస్యలు తలెత్తేలా చేసి, రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని దుష్ప్రచారం చేయడం.

 మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేమీద కేంద్ర మంత్రి నారాయణ్ రాణే… ఇటువంటి కామెంట్సే చేస్తే.. అక్కడి ప్రజలు తిరగబడ్డారు. అలానే యూపీ బీజేపీ వైస్ ప్రెసిడింట్ దయాశంకర్ సింగ్.. అప్పటి ముఖ్యమంత్రి మాయావతి మీద డెరిగేటరీ కామెంట్స్ చేసినప్పుడు  కూడా ప్రజలు తిరగబడ్డారు. రాజ్యాంగ ఫంక్షనరీలు, ప్రజల చేత ఎన్నుకబడిన ప్రజా ప్రతినిధులపై అసభ్యంగా మాట్లాడితే.. తిరగబడటం అన్నది అప్పటికప్పుడు స్పాంటిన్యూస్ గా జరిగే రియాక్షన్. ఇటువంటి సందర్భాల్లో ఎవరో ప్రేరేపించాల్సిన పనిలేదు.

మాయావతిపై అటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు.. అతన్ని బీజేపీ సస్పెండ్ చేసింది. ఇక్కడ చంద్రబాబేమో పట్టాభి వ్యాఖ్యలను సమర్థిస్తూ, ఆ బూతులను పట్టుకుని ఢిల్లీకి వచ్చిన దుర్మార్గపు వ్యక్తి.

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, టీడీపీకి ఎంత ప్రజాదరణ ఉందో 2019 నుంచి జరిగిన శాసనసభ, పార్లమెంటు ఎన్నికల నుంచి మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్, పంచాయతీ ఎన్నికల వరకు అన్ని ఎన్నికల్లో టీడీపీ ఏ విధంగా ఓడిపోయిందో చూశాం. తాడిపత్రి మున్సిపాల్టీ మినహా రాష్ట్రంలో ఏ ఒక్కటీ గెలవని పరిస్థితుల్లో ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

చంద్రబాబు కుట్ర రాజకీయాలు, ఆయన రాక్షస మనస్తత్వం వల్లే రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. చంద్రబాబు ఎప్పుడు ఏ  పార్టీతో అయినా జత కడతాడు.. మరెప్పుడైనా విడిపోతాడు. ఏ సిద్ధాంతాలూ లేని పార్టీ అది.  తన స్వప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడైనా, ఎప్పుడైనా ఫణంగా పెట్టదగిన వ్యక్తి చంద్రబాబు. నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం లేని వ్యక్తి చంద్రబాబు.

మాదక ద్రవ్యాల విషయానికొస్తే..  వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపే.. అంటే 2019కు ముందే టీడీపీ ప్రభుత్వ హయాంలో.. గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి, చంద్రబాబు కేబినెట్ సహచర మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు మాట్లాడిన వీడియోలు వింటే..

మాదక ద్రవ్యాలకు ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేదని, డీజీపీ, ఇతర పోలీసు అధికారులు పదే పదే చెబుతున్నా.. ప్రభుత్వంపైనా, పోలీసులపైనా పదే పదే ఆరోపణలు చేసి, పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి తద్వారా వారిని డీమోరలైజ్ చేసే చర్యల్లో భాగంగా.. మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నాడు. రాష్ట్ర పరువును తీస్తున్నాడు. గంజాయి వ్యాపారంలో లోకేష్ కు పార్టనర్ షిప్ ఉందన్న విషయం కూడా ప్రజలందరికీ తెలుసు.

ప్రతి రోజూ ఏదొక న్యూసెన్స్ క్రియేట్ చేయడం.. దానిద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూడటం.. ఇదే బాబు చెత్త రాజకీయం.

మరోవైపు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంటే..  ఎంతసేపటికీ వ్యవస్థలను మేనేజ్ చేసి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నాడు.

భారతదేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుని, విడిపోయిన ఏకైక పార్టీ టీడీపీనే. అందుకే ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు అన్ని రాజకీయ పార్టీలను కలిసే ప్రయత్నం చేసినా.. ఎవరూ అపాయింట్ మెంటు ఇవ్వలేదు. చంద్రబాబు ట్రూ కలర్స్ ఏమిటో.. అన్ని రాజకీయా పార్టీలకు తెలుసు కాబట్టి, ఎవరూ కలిసేందుకు ఇష్టపడలేదు.

పట్టాభికి బాబు నుంచి ప్రాణభయం

 పట్టాభి మాల్దీవులకు వెళ్ళాడు. తనకై తాను పారిపోయాడు. చంద్రబాబు ఎంత స్వార్థపరుడంటే.. పట్టాభిని భౌతికంగా ఎలిమినేట్ చేసి, దానిని వైయస్ఆర్సీపీ మీద రుద్దగలిగిన చాకచక్యం ఉన్న వ్యక్తి.  మోసం, దగా అన్నది చంద్రబాబుకు పుట్టుకతో వచ్చిన విద్య. పట్టాభికి చంద్రబాబు గురించి బాగా తెలుసు కాబట్టి,  వైయస్ఆర్సీపీకి భయపడి కాదు, చంద్రబాబుకు భయపడి, ఎక్కడ తన ప్రాణాలకు హాని కలుగుతుందనే భయంతో మాల్దీవులకు పారిపోయాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్