Sunday, January 19, 2025
Homeసినిమాగ్లామర్ తో పాటు జోరు పెంచుతున్న త్రిష! 

గ్లామర్ తో పాటు జోరు పెంచుతున్న త్రిష! 

త్రిష తన అందచందాలతో .. అభినయంతో కొంత కాలం పాటు టాలీవుడ్ ను ఏలేసింది. స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ, భారీ విజయాలను తన సొంతం చేసుకుంది. ఒక వైపున సీనియర్ స్టార్ హీరోలతోనూ .. మరో వైపున యువ కథానాయకులతోను మెరిసింది. కోలీవుడ్ లోను .. టాలీవుడ్ లోను ఏక కాలంలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పేసింది. ఈ రెండు భాషల్లోనూ గట్టిపోటీని ఎదుర్కుంటూ ఆమె ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవడం విశేషం.

అయితే కొత్త హీరోయిన్స్ పొలోమంటూ వస్తుండటంతో, సహజంగానే త్రిషకి అవకాశాలు తగ్గాయి. టాలీవుడ్ ఆమెను పూర్తిగా పక్కనే పెట్టేసింది. కోలీవుడ్ లో ఆమె నాయిక ప్రధానమైన పాత్రలను చేస్తూ వెళుతోంది. ఇక త్రిష పనైపోయిందని అంతా అనుకున్నారు. కానీ త్రిష డీలాపడిపోలేదు .. తన గ్లామర్ ను కాపాడుకుంటూ వెళ్లింది .. నిజం చెప్పాలంటే మునుపటికంటే గ్లామరస్ గా తయారైంది. ’96’ హిట్ తో తన ఛరిష్మా ఇంకా తగ్గలేదని నిరూపించింది.

‘పొన్నియిన్ సెల్వన్’ చూసినవారు త్రిష గ్లామర్ చూసి ఆశ్చర్యపోయారు. ఐశ్వర్య రాయ్ కంటే అందంగా మెరిసిన ఆమెను చూస్తూ ఉండిపోయారు. ఆ గ్లామర్ ఇప్పుడు ఆమెకు వరుస ఆఫర్లు తెచ్చి పెడుతోంది. ఏకంగా విజయ్ జోడీగా ఆమె ‘లియో’ సినిమాలో కనిపించనుంది. ఇక ఇదే సమయంలో నయన్ కోలీవుడ్ లో సినిమాల సంఖ్యను తగ్గించుకుంది. దాంతో అక్కడా .. ఇక్కడా కూడా సీనియర్ హీరోలకి జోడీ కావాలనగానే ముందుగా త్రిష పేరునే ప్రస్తావిస్తున్నారు. ఇంత కాలం తరువాత కూడా గ్లామర్ తో పాటు గ్రాఫ్ ను కూడా పెంచుకోవటం త్రిషకి మాత్రమే సాధ్యమైందని చెప్పాలేమో.

Also Read : టాలీవుడ్ సీనియర్ స్టార్స్ దృష్టి కూడా త్రిష పైనే!

RELATED ARTICLES

Most Popular

న్యూస్