Saturday, January 18, 2025
Homeసినిమామ‌హేష్ కోసం స్టైల్ మార్చిన త్రివిక్ర‌మ్

మ‌హేష్ కోసం స్టైల్ మార్చిన త్రివిక్ర‌మ్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్… వీరిద్ద‌రి కాంబినేష‌న్లో రానున్న మూవీ కోసం అభిమానులు ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు. అత‌డు, ఖ‌లేజా చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి చేస్తున్న సినిమా కావ‌డంతో ఈసారి మ‌హేష్ ని ఎలా చూపించ‌నున్నారు అని ఆస‌క్తిగా మారింది. అయితే.. త్రివిక్ర‌మ్ ఎవ‌రితో సినిమా చేసినా త‌న స్టైల్ మాత్రం మార్చ‌రు. ఫ్యామిలీ సెటప్ తోనే సినిమాలు తీస్తుంటారు కానీ.. ఈసారి త్రివిక్ర‌మ్ త‌న స్టైల్ మార్చార‌ని స‌మాచారం.

అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కథతో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. త్రివిక్ర‌మ్ చెప్పిన క‌థ మహేష్ ను బాగా ఎగ్జైట్ చేసింద‌ట‌. ఇంత మాస్, యాక్షన్ సినిమా ఇటీవల మహేష్ చేయలేదు. అయితే దీన్ని పాన్ ఇండియా సినిమా చేయాలా వద్దా అన్నది ఇంకా డిసైడ్ చేయలేదు. సినిమా విడుదల టైమ్ లో బాలీవుడ్ పరిస్థితులు చూసి డిసైడ్ చేస్తారని తెలుస్తోంది. సినిమాలో త్రివిక్రమ్ స్టయిల్ ఫ్యామిలీ టచ్ ఈ సారి కాస్త తక్కువే వుంటుందని స‌మాచారం.

మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఎంత త్వరగా ఈ సినిమా వస్తుందా అని చూస్తున్నారు. హారిక హాసిన సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. స‌మ్మ‌ర్ లో ఈ మూవీని రిలీజ్ చేయాల‌నేది ప్లాన్. మ‌రి.. మ‌హేష్ ని మాస్ అవ‌తార్ లో త్రివిక్ర‌మ్ ఎలా చూపిస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్