Saturday, September 28, 2024
Homeసినిమామ‌హేష్ మూవీలో న‌టించే స్టార్ ఎవ‌రు?

మ‌హేష్ మూవీలో న‌టించే స్టార్ ఎవ‌రు?

Who is he? సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ‘స‌ర్కారు వారి పాట’ చేస్తున్నారు. ఈ చిత్రానికి ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. మే 12న స‌ర్కారు వారి పాట ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. అయితే..  ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ బాబు.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్ష‌న్ లో ఓ భారీ చిత్రం చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. అయితే.. ఈ సినిమాలో హీరోకి స‌మాన‌మైన పాత్ర ఉంది. ఈ పాత్రకు ఇతర భాషల హీరో ఎవరైనా కావాల్సి వుంటుందని తెలుస్తోంది. ఎవర్ని తీసుకోవాలన్నది ఇంకా దర్శకుడు త్రివిక్రమ్ ఫిక్స్ కాలేదని స‌మాచారం. మలయాళ హీరో కానీ, తమిళ యంగ్ హీరో కానీ తీసుకుంటే బాగుంటుంద‌ని అనుకుంటున్నార‌ట‌. ఈ సినిమా షూటింగ్ ను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌నుకుంటున్నార‌ని స‌మాచారం.

త్రివిక్ర‌మ్ స్ర్కిప్ట్ రెడీ చేసి మ‌హేష్ ఎప్పుడంటే.. అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయ‌డానికి రెడీగా ఉన్నారు. స‌ర్కారు వారి పాట పూర్తైన త‌ర్వాత ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ పై మ‌రింత క్లారిటీ వ‌స్తుంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అత‌డు, ఖ‌లేజా చిత్రాలు  ఆకట్టుకున్నాయి.

Also Read : సోష‌ల్ మీడియాలో తండ్రీ కూతుళ్ళ హల్ చల్!

RELATED ARTICLES

Most Popular

న్యూస్