Sunday, January 19, 2025
Homeసినిమాధనుశ్ ఓ కర్మ యోగి: త్రివిక్రమ్ 

ధనుశ్ ఓ కర్మ యోగి: త్రివిక్రమ్ 

ధనుశ్ హీరోగా దర్శకుడు వెంకీ అట్లూరి ‘సార్‘ సినిమాను రూపొందించాడు. సంయుక్త మీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాకి సూర్యదేవర నాగవంశీతో పాటు త్రివిక్రమ్ కూడా ఒక నిర్మాతగా ఉన్నారు. ఈ నెల 17వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా నిన్న రాత్రి హైదారాబాదు – నెక్లెస్ రోడ్ లోని ‘పీపుల్స్ ప్లాజా’లో ప్రీ రిలీజ్ ఈవెంటును జరుపుకుంది. ఈ కార్యక్రమానికి త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

త్రివిక్రమ్ మాట్లాడుతూ .. “ధనుశ్ ను నేను చాలా కాలంగా పరిశీలిస్తూ వస్తున్నాను. ఆయన ఈ కథను ఒప్పుకోడేమోనని అనుకున్నాను. కానీ ఆయన వెంటనే అంగీకరించి ఈ ప్రాజెక్టును నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాడు. కోలీవుడ్ లో విభిన్నమైన పాత్రలను చేసిన మహానటులుగా శివాజీ గణేశన్ గారు  .. కమల హాసన్ గారు కనిపిస్తారు. వారి తరువాత స్థానంలో .. ఈ తరంలో నాకు ధనుశ్ కనిపిస్తున్నాడు. ఆ సీనియర్ స్టార్స్ మాదిరిగానే ధనుశ్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వెళుతున్నాడు.

ధనుశ్ కి భయం లేకపోవడం నేను గమనించాను. సూపర్ హిట్ వస్తే దానిని గురించే ఆలోచిస్తూ పొంగిపోవడం .. ఫ్లాప్ వస్తే కుంగిపోవడం నేను చూడలేదు. జయాపజయాలను పెద్దగా పట్టించుకోకపోవడం నాకు నచ్చింది. ఆయన తన పనిని తాను చేస్తూ వెళతాడు .. ఫలితాన్ని గురించిన ఆలోచన చేయడు. అందువలన నాకు ధనుశ్ లో ‘కర్మయోగి’ కనిపిస్తాడు. ఇంతమంచి కథను చేయడానికి ముందుకు వచ్చిన ‘సార్’ను భుజాలకి ఎత్తుకుంటారని ఆశిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

Also Read: సార్ పైనే ఆశలు పెట్టుకున్న సంయుక్త మీనన్!

RELATED ARTICLES

Most Popular

న్యూస్