Saturday, November 23, 2024
HomeసినిమాMahesh Babu- Trivikram: స్క్రిప్ట్ పై మళ్ళీ కసరత్తు?

Mahesh Babu- Trivikram: స్క్రిప్ట్ పై మళ్ళీ కసరత్తు?

మహేష్‌ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ భారీ చిత్రం చేస్తున్నాడు.  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్‌, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే.. త్రివిక్రమ్ ఈ సినిమా చేస్తున్నప్పటికీ మరో వైపు పవన్, తేజ్ మూవీకి  స్క్రీన్ ప్లే – సంభాషణలు అందించడం… ఓజీ మూవీకి కూడా త్రివిక్రమ్ అన్నీ తానై చూసుకోవడంతో మహేష్ మూవీ పై సరిగా దృష్టి పెట్టడంలేదనే విమర్శలు వచ్చాయి.

మొదలు ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత యాక్షన్ పార్ట్ బాగా రాలేదని మహేష్  భావించడంతో అది తీసేసి మళ్లీ కథపై మరోసారి కసరత్తు చేశారు.  ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత కూడా కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారట. ఇప్పుడు త్రివిక్రమ్ స్క్రిప్ట్ పై ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం మహేష్‌ బాబు విదేశాల్లో ఉన్నారు. అతి త్వరలో హైదరాబాద్ రానున్నారు. వచ్చిన వెంటనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం.

ఈ సినిమాని ఆగష్టులో విడుదల చేయాలి అనుకున్నారు కానీ.. అప్పటికి కంప్లీట్ కాదనే ఉద్దేశ్యంతో సంక్రాంతికి మార్చారు. ఇప్పుడు ఎక్కువ టైమ్ ఉండడంతో కథ పై మరోసారి చెక్ చేసుకుంటున్నారని తెలిసింది. ఈసారి మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాని ఎంతో పట్టుదలగా త్రివిక్రమ్ చేస్తున్నారట. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ కీలక పాత్ర పోషించనుందని టాక్ వినిపిస్తుంది. నిర్మాత రాధాకృష్ణ ఏమాత్రం రాజీపడకుండా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ నెల 31న ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్