Sunday, April 20, 2025
HomeTrending Newsమోదీ, బీజేపీ కేంద్రమంత్రుల వ్యాఖ్యలపై తెరాస కౌంటర్

మోదీ, బీజేపీ కేంద్రమంత్రుల వ్యాఖ్యలపై తెరాస కౌంటర్

ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ కేంద్ర మంత్రుల వ్యాఖ్యలపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ మాట్లాడిన విషయాలపై మోదీ స్పందించ లేదన్నారు. కేసీఆర్ ప్రశ్నలకు మోదీ దగ్గర సమాధానం లేదని వ్యాఖ్యానించారు. శ్రీలంక ప్రభుత్వంపై ప్రధాని ఒత్తిడి తెచ్చారా లేదా చెప్పలేదన్నారు. మోడీ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నం చేసారని మండిపడ్డారు. తెలంగాణకు కొత్త జాతీయ రహదారులు, రీజినల్ రింగ్ రోడ్డు ఇవ్వలేదని, ఇప్పటి వరకు ఇచ్చినవి తెలంగాణ ప్రజల హక్కు అని చెప్పుకొచ్చారు.

తెలంగాణ రైల్వేలకు ప్రధాని అన్యాయం చేశారని ఆయన విమర్శించారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మోదీకి ధైర్యం లేదని… మన్మోహన్‌పై గతంలో హేళనగా మాట్లాడారని ఆయన అన్నారు. రూపాయి విలువ ఎందుకు తగ్గిందని దేశానికి మేకిన్ ఇండియా ద్వారా కొత్తగా ఏమి వచ్చిందని నిలదీశారు. 2020 నవంబర్‌లో కోవిడ్ వ్యాక్సిన్ కోసం భారత్ బయోటెక్‌కు ప్రధాని వస్తే ఎయిర్ పోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైన కేసీఆర్‌ను పీఎంఓ వద్దని చెప్పారని తెలిపారు. ‘‘కుటిలమైన రాజనీతి నీ దగ్గర ఉంది. మా కేసీఆర్ దగ్గర లేదు’’ అని అన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు కడుపు నిండా నీళ్లు తాగించేందుకు ప్రాజెక్టులు కట్టామని వినోద్ కుమార్ పేర్కొన్నారు

Also Read : మోడీ హయంలో దిగజారిన దేశ ప్రతిష్ట – కెసిఆర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్