Saturday, November 23, 2024
HomeTrending Newsరౌడీయిజం, ఈడీయిజం, ఐటీయిజం: జీవన్ రెడ్డి

రౌడీయిజం, ఈడీయిజం, ఐటీయిజం: జీవన్ రెడ్డి

Ism: తమ రాష్ట్రానికి ప్రధాన మంత్రి వస్తే కనీసం ఆయన్ను రిసీవ్ చేసుకోవడానికి కూడా ముఖ్యమంత్రులు ఇష్టపడడం లేదంటే దీనికి బిజెపి విధానాలే కారణమని టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిన్న కేసిఆర్, స్టాలిన్…..గతంలో మమతా బెనర్జీ, కేజ్రీ వాల్ లు కూడా ప్రధానిని ఆహ్వానించడానికి ఎయిర్ పోర్ట్ కు రాలేదని ఆయన గుర్తు చేశారు.

వారసత్వ, కుటుంబ రాజకీయాలపై ప్రధాని మోడీ మాట్లాడడం హాస్వాస్పదంగా ఉందని జీవన్ రెడ్డి అన్నారు. బిజెపి నేతల కొడుకులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా లేరా అని ప్రశ్నించారు. అమిత్ షా కొడుకు జై షా కూడా బిసిసిఐ కార్యదర్శిగా మొత్తం పెత్తనం చెలాయించడం లేదా అని నిలదీశారు.  ప్రాంతీయ పార్టీలు దేశ ద్రోహుల పార్టీలుగా మాట్లాడుతున్న మోడీ… కాశ్మీర్ లో పీడీపీ, ఆంధ్రాలో టిడిపి, యూపీలో అప్నా దళ్, పంజాబ్ లో అకాలీ దళ్, హర్యానాలో చౌతాలా పార్టీలతో బిజెపి పొత్తుపెట్టుకుందని, ఇవి కుటుంబ పార్టీలేనన్న విషయం వారు మర్చిపోయినట్లున్నారని  ఎద్దేవా చేశారు.  వీరితో పొత్తు పెట్టుకున్న మీ పార్టీని కూడా దేశ ద్రోహుల పార్టీ అనొచ్చా అని సూటిగా అడిగారు.

రాష్ట్రంలో అభివృద్ధికి ఏమాత్రం సహకరించని మోడీ కేవలం తమ పార్టీపై దుమ్మెత్తి పోయడానికే వచ్చినట్లుందన్నారు.  ఈ దేశానికి బిజెపి శనిలా పట్టుకుందని వ్యాఖ్యానించిన జీవన్ రెడ్డి బిజెపి భారతీయ జగడాల పార్టీగా మారిందన్నారు. బిజెపి రౌడీయిజానికికి, మోడీ ఈడీయిజానికి, అమిత్ షా ఐటీయిజానికి ఎవరూ భయపడేవారు లేరన్నారు. తెలంగాణాలో కెసియార్ యిజమే నడుస్తుందని, ఇక్కడ బిజెపి ఖాయం కాదు మాయం, మేకిన్ ఇండియా కాదు, ఫేకిన్ ఇండియా… అంటూ జీవన్ రెడ్డి ప్రాసలతో తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

Also Read : కుటుంబ పాలనతో అవినీతిమయం – ప్రధాని మోడీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్