Friday, March 28, 2025
HomeTrending Newsధాన్యం కొనుగోలు కోసం తెరాస ఎంపీల ఆందోళన

ధాన్యం కొనుగోలు కోసం తెరాస ఎంపీల ఆందోళన

తెలంగాణ రాష్ట్రంలో పండిచిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఆవరణలోని గాంధి విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేసిన తెరాస   రాజ్యసభ,లోక్‌స‌భ‌ ఎంపీలు. నిరసన కార్యక్రమంలో నామ నాగేశ్వర్ రావు, దయాకర్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, రంజిత్ రెడ్డి, కవిత, బిబి పాటిల్, రాములు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టిన ఎంపీలు దేశం మొత్తానికి ఒకే విధమైన సేకరణ విధానాన్ని అమలు చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణలొ పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయలని డిమాండ్ చేశారు… వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్