Sunday, January 19, 2025
HomeTrending Newsమునుగోడుపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి మంత్రాంగం

మునుగోడుపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి మంత్రాంగం

మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. మునుగోడును అభివృద్ధి చేయడంలో రాజగోపాల్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని, ఆయన తన స్వార్థం కోసమే మునుగోడు ఉప ఎన్నిక తీసుకొచ్చారని మంత్రి విమర్శించారు. ప్రజలు అభివృద్ధి, సంక్షేమం వైపే నిలవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు అహర్నిశలూ కృషి చేయాలని మంత్రి జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు.
మునుగోడు నియోజకవర్గంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి, మునుగోడుపై గులాబీ జెండా ఎగురవేసి, పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ గారికి కానుకగా అందజేస్తామని, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు స్పష్టం చేశారు. సిఎం కెసిఆర్ గారు ఎవరిని అభ్యర్థిగా నియమించినా అందరి సంపూర్ణ మద్దతు ఉంటుందని, అందరం ఏకమై కలిసికట్టుగా కృషిచేస్తామన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు సంబంధించిన వ్యూహాలు, విధివిధానాలపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ జిల్లా మంత్రి, పార్టీ అధ్యక్షులు, జిల్లా ఇన్ చార్జిలతో బుధవారం హైదరాబాద్ లో సమావేశమై చర్చించారు.

ఈ సమావేశంలో జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ నాయక్, జిల్లా పార్టీ ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్ రావులతోపాటు, జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం, మునుగోడు జడ్పిటిసి రవి, నాంపల్లి జెడ్పిటిసి వెంకటేశ్వర రెడ్డి, నారాయణపూర్ ఎంపీపీ ఉమా రామచంద్ర రెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, చౌటుప్పల్ ఎంపీపీ వెంకట్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు బుచ్చిరెడ్డి పెద్దింటి, శివ జాజిల అంజయ్య శేఖర్, సింగిల్ విండో చైర్మన్ దామోదర్ రెడ్డి, జంగారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, చండూరు మున్సిపల్ చైర్మన్ వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, మునుగోడు ఎంపీపీ స్వామి, నాంపల్లి ఎంపీపీ శ్వేతా రవీందర్ రెడ్డి, మర్రిగూడ జెడ్పిటిసి సురేందర్ రెడ్డి, మర్రిగూడ ఎంపీపీ మోహన్ రెడ్డి, మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్, వైస్ ఎంపీపీ స్వామి తదితర మునుగోడు నియోజకవర్గ స్థానిక నేతలు., ప్రజాపతినిధులు, టిఆర్ఎస్ పార్టీ ముఖ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్