Sunday, January 19, 2025
HomeసినిమాShiva: 34 ఏళ్ల శివ గురించి ఎవ‌రికీ తెలియ‌ని నిజాలు.

Shiva: 34 ఏళ్ల శివ గురించి ఎవ‌రికీ తెలియ‌ని నిజాలు.

తెలుగు సినిమా న‌డ‌త‌ను మార్చిన సంచ‌ల‌న చిత్రం ‘శివ‌’. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున – అమ‌ల జంట‌గా న‌టించారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున నిర్మించిన ఈ సినిమా ద్వారా రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అయ్యారు. రూల్స్ ని బ్రేక్ చేసి.. తెలుగు సినిమా న‌డ‌త‌నే మార్చేసింది ‘శివ’

Shiva

సినిమా. తెలుగులోనే కాకుండా… కోలీవుడ్, బాలీవుడ్ లో సైతం సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

దక్షిణ భారత సినీ చరిత్రలో తెలుగు, తమిళ భాషల్లో ఒకే చిత్రంతో 100 రోజులకు పైగా హౌస్ ఫుల్స్ గల హీరో నాగార్జున ఒక్క‌డే. త‌మిళ‌నాడులో ఉద‌యం టైటిల్ తో రిలీజ్ చేసారు. వైజాగ్-జగదాంబ థియేట‌ర్ లో -120 రోజులు ఫుల్ 155 రోజులు రన్ అయ్యింది. ఇక మద్రాసు దేవిక‌ళ థియేట‌ర్ లో 145 రోజులు ఫుల్ అయి, 259 రోజులు రన్ అయ్యింది. ఈ రికార్డ్ ఇప్ప‌టికీ ఇలాగే ఉంది.

శివ గురించి మ‌నీ మేట‌ర్స్…
1) రామ్ గోపాల్ వ‌ర్మ‌కు 50,000 ప్ల‌స్ లాభాల్లో 5% వాటా
2) ఇళ‌య‌రాజాకు 4 ల‌క్ష‌లు
3) త‌నికెళ్ల భ‌ర‌ణి 35 వేలు (రాసినందుకు ప్ల‌స్ నానాజీ వేషం వేసినందుకు)
4) ర‌ఘ‌వ‌ర‌న్ 2 ల‌క్ష‌లు
5) శివ నాగేశ్వ‌ర‌రావు – 37 వేలు
6) మొత్తం సినిమా బ‌డ్జెట్ – 85 ల‌క్ష‌లు
7) నైజాంలో కోటి రూపాయ‌లు వ‌సూలు చేసిన తొలి సినిమా
8) నైజాం, వైజాగ్ ల‌లో నిర్మాత‌లే సొంతంగా రిలీజ్ చేసారు.
9) గీతాంజ‌లి చిత్ర నిర్మాత సి.ఎల్.న‌ర‌సారెడ్డి గుంటూరు జిల్లాలో పంపిణీ చేసారు
10) సినిమా రిలీజ్ కి ముందు రీమేక్ హ‌క్కుల‌కు ల‌క్ష రూపాయ‌లు ఇస్తామ‌న్నారు. రిలీజ్ త‌ర్వాత త‌మిళ్ లో డ‌బ్ చేస్తే.. 85 ల‌క్ష‌లు బిజినెస్ అయ్యింది. 2 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది.
ఇలా శివ సంచ‌ల‌నాల గురించి చెప్పాలంటే… చాలా ఉన్నాయి. ఒక్క మాట‌లో చెప్పాలంటే… క్రీస్తుకు ముందు క్రీస్తుకు త‌ర్వాత అని ఎలా అయితే చెబుతామో… సినిమా గురించి చెప్పాలంటే… శివ‌కు ముందు శివ త‌ర్వాత అని చెబుతుంటారు. శివ రిలీజై నేటికి 34 ఏళ్లు. మ‌రో 30 ఏళ్లు అయినా శివ గురించి ఇలాగే మాట్లాడుకుంటారు. ద‌టీజ్… నాగార్జున – వర్మ‌ల శివ‌.

RELATED ARTICLES

Most Popular

న్యూస్