తెలంగాణా శాసనసభ, శాసనమండలి సమావేశాలు అక్టోబర్ 1కి వాయిదా పడ్డాయి. గులాబ్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని చాలా జిల్లాలు అతలాకుతలం అయిన నేపథ్యంలో ప్రజలకు అండగా ఉండేందుకు, నియోజకవర్గాల్లో సహాయ పునారావాస కార్యక్రమాలు పర్యవేక్షించేందుకు వీలుగా సమావేశాలు వాయిదా వేశారు.
ఎమ్మెలేలు, ఎమ్మెల్సీల విజ్ఞప్తి మేరకు, సిఎం కేసిఆర్, వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్ల అభిప్రాయాన్ని తెలుసుకొని సమావేశాలను అక్టోబర్ 1 నాటికి వాయిదా వేయాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, కౌన్సిల్ ప్రోటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి నిర్ణయించారు. స్పీకర్, చైర్మన్ సూచన మేరకు అసెంబ్లీ కార్యదర్శి వి. నరసింహాచార్యులు దీనిపై బులెటిన్ విడుదల చేశారు.
దీనితో నేడు (సెప్టెంబర్ 28)న ఉదయం 10 గంటలకు మొదలు కావాల్సిన ఉభయ సభల సమావేశాలు అక్టోబర్ 1 ఉదయం 10 గంటలకు వాయిదా పడ్డాయి,.