మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ1 గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను తెలంగాణా హై కోర్టు రద్దు చేసింది. మే 5వ తేదీ లోగా సిబిఐ కోర్టుముందు లొంగిపోవాలని లేకపోతే రెస్టు చెయ్యవచ్చని తీర్పులో పేర్కొంది. కేసు విచారణ మొదలు పెట్టగానే గంగిరెడ్డిని అరెస్టు చేశారు, అయితే 90రోజుల్లో కేసు విచారణ పూర్తి చేయలేదన్న కారణంతో గంగిరెడ్డికి బెయిల్ లభించింది.
కాగా, ఈ కేసు విచారణ సిబిఐ చేపట్టడం. ప్రస్తుతం కేసు విచారణ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ప్రధాన నిందితుడిగా ఉన్న గంగిరెడ్డి బైట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదిరిస్తున్నారని సిబిఐ వాదించింది. దీన్ని పరిగణన లోకి తీసుకున్న హైకోర్టు గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేస్తూ ధర్మాసనం నిర్ణయించింది. నిన్న ఇరు పక్షాల వాదనను విన్న ధర్మాసనం నేడు తుది తీర్పు వెల్లడించింది.