వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. అయితే సిబిఐ విచారణకు హాజరుకావాలని అవినాష్ రెడ్డిని ఆదేశించింది ఒకవేళ విచారణకు గైర్ హాజరైతే అప్పుడు తిరిగి హైకోర్టును ఆశ్రయించవచ్చని సిబిఐ కి సూచించింది.
సిపిఐ తన అరెస్టు చేయకుండా ఆపాలంటూ అవినాష్ రెడ్డి తొలుత తెలంగాణ హైకోర్టులోను ఆ తర్వాత సుప్రీంకోర్టులోను పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ను ఆశ్రయించాలని తీర్పు చెప్పింది.
ఈనెల 25 26 27 తేదీల్లో సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు వెకేషన్ బెంచ్ తీర్పును నేటికీ రిజర్వ్ చేసింది ఉదయం కోర్టు ప్రారంభం కాగానే న్యాయమూర్తి తీర్పును చదివి వినిపించారు.
- 5 లక్షల రూపాయల పూచికత్తుతో రెండు షూరిటీలు సమర్పించాలని
- ప్రతి శనివారం విచారణకు హాజరుకావాలని
- జూన్ నెలాఖరి వరకు ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య విచారణకు హాజరుకావాలని
- సిబిఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళరాదని
షరతులు విధించింది