Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్అత్యుత్తమ క్రీడా పాలసీ: మంత్రి శ్రీనివాస గౌడ్

అత్యుత్తమ క్రీడా పాలసీ: మంత్రి శ్రీనివాస గౌడ్

Sports Policy: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో క్రీడల అభివృద్ధికి తోడ్పాటు ను అందిస్తున్నారని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్  వెల్లడించారు. హైదరాబాద్ లోని  ఉప్పల్ లో JEET క్రికెట్ అకాడమీ ని స్థానిక ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, ప్రభుత్వ విప్ గాదరి కిషోర్ లతో కలసి మంత్రి ప్రారంభించారు.  అనంతరం మంత్రి శ్రీనివాస గౌడ్ క్రీడాకారులతో కలసి క్రికెట్ ఆడి వారిలో స్ఫూర్తి ని నింపారు.

ఈ సందర్భంగా అయన మాట్లాతుడూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందిస్తున్నామన్నారు. క్రీడల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పన కు, క్రీడాకారులకు, కోచ్ లకు ఈ పాలసీలో పెద్ద పీట వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలను వేగంగా పూర్తి చేస్తున్నామన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కార్యాచరణ ను రూపొందిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్