Congrats: ఇటీవల బ్రెజిల్ లో ముగిసిన డెఫ్ ఒలింపిక్స్ లో మన రాష్ట్రానికి చెందిన ధనుష్ శ్రీకాంత్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో 2 గోల్డ్ మెడల్స్ ను సాధించాడు. ఈ సందర్భంగా రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో శ్రీకాంత్ ను అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ క్రీడలను ప్రోత్సహిస్తున్నారన్నారు. శ్రీ ధనుష్ శ్రీకాంత్ తెలంగాణ క్రీడా శాఖ, గన్ ఫర్ గ్లోరీ అకాడమీ లో శిక్షణ పొందితూ నేడు డెఫ్ ఒలింపిక్స్ లో 2 గోల్డ్ మెడల్స్, 2019 లో దోహా లో జరిగిన ఏషియన్ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో 3 గోల్డ్ మెడల్స్ సాధించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 2 శాతం, ఉన్నత విద్య లో 0.5 శాతం రిజర్వేషన్లు ను కల్పిస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులను ఆర్థికంగా ప్రోత్సాహకాలను సీఎం అందిస్తున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పల్లె ప్రగతి – పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో నూ, పట్టణాల్లో నూ క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామన్నామని వివరించారు.
దేశం గర్వించదగ్గ క్రీడాకారులను అందించేందుకు కృషి చేస్తున్నామని, క్రీడాకారులను ఉన్నత స్థాయి లో నిలిపేందుకు రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడా పాలసీ ని రూపొందిస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా ధనుష్ శ్రీకాంత్ ను తీర్చిదిద్దిన అతని తల్లిని కూడా మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో కొడంగల్ శాసన సభ్యులు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి, క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read : బీచ్ వాలీబాల్ ప్లేయర్లకు అభినందన