Saturday, May 10, 2025
HomeTrending Newsపతంగుల కల్చర్ ప్రోత్సహించాలి: తలసాని

పతంగుల కల్చర్ ప్రోత్సహించాలి: తలసాని

పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోతున్న తరుణంలో అసలు మనం పండుగలు ఎందుకు చేసుకుంటున్నామో మర్చిపోతున్నామని, మన సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు తెలియజెప్పాలని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పిలుపు ఇచ్చారు. సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా నెక్లెస్ రోడ్ (PV మార్గ్) లోని పీపుల్స్ ప్లాజాలో కైట్ ఫెస్టివల్ మంత్రి తలసాని పాల్గొని  కైట్ ఎగురవేశారు.

సంక్రాంతి తెలుగువారికి పెద్ద పండుగ అని, కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఈ మూడు రోజులు బ్రహ్మండంగా పండగ జరుపుకుంటారని అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న సుఖ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కెసిఆర్ నాయకత్వంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, సమృద్ధిగా సాగునీరు, తాగునీరు అందిస్తున్నామని అన్నారు.  ఆంధ్రలో కోడి పందేలు జరుగుతాయని… కానీ అక్కడ పతంగ్ లను అంతగా ప్రోత్సహించారని అభిప్రాయపడ్డారు.  చిన్నారులకు తలసాని పతంగులు పంపిణీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్