Saturday, November 23, 2024
HomeTrending NewsTSPSC: లీకులో కేటీఆర్ శాఖ ఉధ్యోగులదే కీలకపాత్ర - కాంగ్రెస్

TSPSC: లీకులో కేటీఆర్ శాఖ ఉధ్యోగులదే కీలకపాత్ర – కాంగ్రెస్

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ద్వారా లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులను సస్పెండ్ చేయాలని గవర్నర్ ను కోరామన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం గురువారం గవర్నర్ ను కలిసింది. పేపర్ లీక్ అంశంపై ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఉన్న బోర్డును రద్దు చేసే విశేషాధికారాలను ఉపయోగించాలని కోరారు.
గవర్నర్ కు ఫిర్యాదు అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  పేపర్ లీక్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేశామన్న ఆయన… మంత్రి కేటీఆర్ శాఖ ఉధ్యోగులదే పేపర్ లీక్ లో కీలకపాత్ర అని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ కు అప్లికేషన్ పెట్టామని చెప్పారు. వ్యాపం కుంభకోణంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కోడ్ చేస్తూ అప్లికేషన్ ఇచ్చామని చెప్పుకొచ్చారు.

విచారణ పూర్తయ్యే వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను రద్దు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ అధికారం గవర్నర్ కు ఉందన్నారు. పేపర్ లీకేజీ లో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని ఆరోపించారు. కోట్లాది రూపాయలకు పేపర్ అమ్ముకున్నారని చెప్పిన రేవంత్ రెడ్డి.. కేటీఆర్, జనార్దన్ రెడ్డి ,అనితా రామచంద్రన్ ను ప్రాసిక్యూట్ చేయడానికి అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను కోరామని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో గవర్నర్ తనకు ఉండే విశేష, విచక్షణాధికారాలను ఉపయోగించాలని కోరారు. లీగల్ ఓపినీయన్ తీసుకుని నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ చెప్పారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కేటీఆర్ ను భర్తరఫ్ చేసేందుకు అనుమతివ్వాలని గవర్నర్ తమిళిసైను కోరినట్టుగా చెప్పారు. గవర్నర్ ను కలిసిన వారిలో పొన్నాల లక్ష్మయ్య, మధు యాష్కీ, సంపత్ కుమార్, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, మల్లు రవి, వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు నేతలు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్