శ్రీరామనవమి సందర్భంగా ఈనెల 30న భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సిఎం కెసిఆర్ ను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు దంపతులను ఈ రోజు (బుధవారం) ప్రగతి భవన్ లో కలిసి ఆహ్వాన పత్రికను అందజేసిన..దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.. భద్రాచలంలో ఏర్పాట్లను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, పూజారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *