Saturday, January 18, 2025
HomeTrending Newsదుర్గమ్మకు టీటీడీ పట్టు వస్త్రాలు

దుర్గమ్మకు టీటీడీ పట్టు వస్త్రాలు

నవరాత్రి ఉత్సవాల సందర్బంగా విజయవాడ శ్రీ కనక దుర్గ అమ్మవారికి టీటీడీ తరపున చైర్మన్  వైవి సుబ్బారెడ్డి దంపతులు మంగళవారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ దంపతులకు ఆలయ ఈవో  భ్రమరాంబ ,అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు . అనంతరం చైర్మన్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు .

వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ  సిఎం జగన్  ఆదేశాల మేరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో అన్ని రకాల విఐపి దర్శనాలు రద్దు చేసి సామాన్య భక్తులకు పెద్ద పీట వేశామన్నారు . ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజయవాడ . కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కూడా దసరా ఉత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్ద పీట వేశారని చెప్పారు . కుమ్మరి పాలెం సెంటర్ లో ఉన్న టీటీడీ స్థలంలో భక్తులకు వసతి కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు . దాతల సహకారంతో క్షేత్ర పాలక ఆంజనేయ స్వామి విగ్రహానికి బంగారు తొడుగు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు . సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని , ప్రతి ఇళ్ళు సుఖ సంతోషాలతో తులతూగేలా ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్థించానన్నారు . రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెప్పారు . టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్ష్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్