Sunday, January 19, 2025
Homeసినిమాఅది నాకు, నానికి మాత్రమే తెలుసు - శివ నిర్వాణ

అది నాకు, నానికి మాత్రమే తెలుసు – శివ నిర్వాణ

నాని – శివ నిర్వాణ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘టక్ జగదీష్’. ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కొన్ని కారణాల వలన థియేటర్లో రిలీజ్ చేయడం కుదరడం లేదు. సెప్టెంబర్ 10న డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు శివనిర్వాణ మాట్లాడుతూ “చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. ‘టక్ జగదీష్’ కథ నానికి చెప్పినప్పటి నుంచి.. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. రెండేళ్ల శ్రమ ఇది. ఏప్రిల్ 16న విడుదల చేద్దామని అనుకున్నాం. ఆ తరువాత మే, జూన్, జూలై, ఆగస్ట్ ఇలా అన్ని అనుకున్నాం. థియేటర్లో ఆ సీన్‌కు అలా ఉంటుంది.. ఈ సీన్‌కు విజిల్స్ పడతాయి.. ఇంటర్వెల్ ఇలా ఉంటుంది అని ఎన్నో అనుకున్నాం. థియేటర్లో సినిమా విడుదల కావడం లేదు అని తెలిసినప్పుడు బాధ కలిగింది. అది నాకు, నానికి మాత్రమే తెలుసు. సినిమాను నాని థియేటర్ డోర్ వద్ద రెండున్నర గంటలు వెయిట్ చేసి నిల్చుని చూస్తాడు. అక్కడి నుంచి అయితే.. అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలుస్తుంది అని నాని ఎప్పుడూ కూడా తన సినిమాలను అలానే చూస్తాడు.”

“థియేటర్లో సినిమా చూడటం నానికి అంత పిచ్చి. షైన్ స్క్రీన్‌తో రెండో సినిమా చేస్తున్నాను. నా డబ్బులే పెట్టి సినిమా తీస్తున్నాను అనేంత ఫ్రీడం నాకు ఉంటుంది. రెండేళ్లు సినిమాను తీశాం. ఐదు నెలలు రిలీజ్ కోసం వెయిట్ చేశారు నిర్మాతలు. పరిస్థితులు ఇంకా మారడం లేదు. ఇలాంటి సందర్భంలో చిన్నా పెద్దా అందరూ థియేటర్లోకి వస్తారా? అందుకే.. ఈ నిర్ణయం తీసుకున్నాం. ఏమైనా తేడా వస్తే మా (నాని, శివ నిర్వాణ) రెమ్యూనరేషన్‌లోంచి కట్ చేసుకొమ్మని చెప్పాం. మా సినిమా అమెజాన్ ద్వారా ప్రతీ ఊర్లోకి వెళ్తోంది. వినాయక చవితి నాడు మా సినిమాను ఊర్లో వాళ్లు కూడా చూస్తారు. ఒక్కో నిర్మాత, ప్రొడక్షన్ కంపెనీ పరిస్థితులు వేరు. ఎవరికి వీలున్నట్టు వారు సినిమాలను రిలీజ్ చేస్తారు. అందరినీ ఒకే గాడిన కట్టేయకండి. వినాయకచవితి నాడు ‘టక్ జగదీష్’ అదిరిపోతుంది’ అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్