7.2 C
New York
Monday, December 11, 2023

Buy now

HomeTrending Newsఆగని పెట్రో వాత..

ఆగని పెట్రో వాత..

దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. దిల్లీలో పెట్రోల్, డీజిల్​పై 40 పైసల చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. హైదరాబాద్​లోనూ పెట్రోల్​పై 45 పైసలు, డీజిల్​పై 43 పైసలు వడ్డించాయి. పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇంధన ధరలను చమురు సంస్థలు మరోసారి పెంచాయి. దిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరను 40 పైసల చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించాయి. తాజా నిర్ణయంతో దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.41కు చేరుకుంది. డీజిల్ ధర రూ.95.07కు ఎగబాకింది. కాగా, 14 రోజుల వ్యవధిలో ఇంధన ధరలు పెరగడం ఇది 12వ సారి. మొత్తంగా ఇప్పటివరకు లీటర్ పెట్రోల్ ధర రూ.8.40 మేర పెరిగింది.

ముంబయిలో పెట్రోల్ ధర 42 పైసలు పెరిగి.. రూ.118.81కు ఎగబాకింది. డీజిల్ ధర 43 పైసలు అధికమై.. రూ.103.05కు చేరుకుంది. 38 పైసల పెరుగుదలతో చెన్నైలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.109.32కు చేరుకోగా.. డీజిల్ ధర 38 పైసలు పెరిగి రూ.99.4కు ఎగబాకింది. కోల్​కతాలో లీటర్ పెట్రోల్​పై 42 పైసలు, డీజిల్​పై 41పైసలు పెరిగింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.113.43గా ఉంది. డీజిల్ ధర రూ.98.21కి చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా…

హైదరాబాద్​లోనూ పెట్రోల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్​పై 45 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. డీజిల్ ధర 43 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్​లో పెట్రోల్ ధర రూ.117.68కు చేరుకుంది. డీజిల్ ధర రూ.103.75కు ఎగబాకింది. గుంటూరులో పెట్రోల్ ధర 44 పైసలు ఎగబాకి.. రూ.119.51కు చేరింది. డీజిల్ ధర రూ.41 పైసలు పెరిగి.. రూ.105.2కు చేరుకుంది. వైజాగ్​లో 44 పైసలు పెరిగిన లీటర్ పెట్రోల్ ధర రూ.118.23కు ఎగబాకింది. డీజిల్ ధర 41 పైసలు అధికమై.. రూ.103.95కు చేరింది.

Also Read :  ఆకాశాన్నంటిన వాణిజ్య సిలిండర్ ధర

RELATED ARTICLES

Most Popular

న్యూస్