Friday, November 22, 2024
Homeజాతీయంవివాదం రేపిన ట్విట్టర్ ‘బ్లూ’ టిక్

వివాదం రేపిన ట్విట్టర్ ‘బ్లూ’ టిక్

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ లో బ్లూ వేరి ఫైడ్ బ్యాడ్జి ని ట్విట్టర్ గంటల వ్యవధిలోనే పునరుద్ధరించింది. 2013 నుంచి వెంకయ్య నాయుడు ట్విట్టర్ లో ఉన్నారు. ఉపరాష్ట్ర పతి పదవి చేపట్టిన తరువాత అయన తన అధికారిక ఖాతా నుంచే ట్వీట్లు పెడుతున్నారు. వ్యక్తిగత అకౌంట్ నుంచి జూలై 23, 2020 నాడు చివరిగా ట్వీట్ చేశారు. ఆ తరువాత దాన్ని అయన వాడలేదు.

నేడు వెంకయ్య వ్యక్తిగత అకౌంట్ లో వెరిఫైడ్ బ్లూటిక్ ను ట్విట్టర్ తొలగించింది. దీంతో నెటిజన్లు మండిపడ్డారు, అలా ఎలా తొలగిస్తారంటూ ట్విట్టర్ కు నిరసన తెలిపారు. దీనిపై ఉపరాష్ట్రపతి కార్యాలయం కూడా ట్విట్టర్ ను సంప్రదించింది. చాల కాలం నుంచి వ్యక్తిగత ఖాతా ఆక్టివ్ గా లేదని, మా వెరిఫికేషన్ విధానం ప్రకారంమే ఆ టిక్ తొలగించామని, వెంటనే పునరుద్ధరిస్తామని తెలియజేసింది. కాసేపటికే వెంకయ్య వ్యక్తిగత ఖాతా లో బ్లూటిక్ ను చేర్చింది.

ముందస్తు సమాచారం లేకుండా ఇలా ఎలా చేస్తారంటూ కేంద్ర ఐటి, కమ్యూనికేషన్ల శాఖ ట్విట్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత దేశంలో రెండో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తికి చెందిన ఖాతా పట్ల ఇంత అగౌరవంగా ప్రవర్తిస్తారా అంటూ మండిపడింది. దీనిపై ట్విట్టర్ కు నోటీసు ఇవ్వాలని నిర్ణయించింది.

ట్విట్టర్ చర్యను బిజెపి తీవ్రంగా ఖండించింది. ఇది రాజ్యాంగంపై దాడి అంటూ బిజెపి మహారాష్ట్ర అధికార ప్రతినిధి సురేష్ నఖువా అభివర్ణించారు.

ట్విట్టర్ అకౌంట్ లు కనీసం ఆరు నెలలకోసారి ఉపయోగించాల్సి ఉంటుందని, లేనిపక్షంలో ఇలా జరుగుతుందని, అయినా విషయం తెలిసిన వెంటనే దాన్ని సరిదిద్దమని వివరణ ఇచ్చింది. మోడీ ప్రభుత్వం కొత్త ఐటి, డిజిటల్ మీడియా చట్టాలు తెచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వానికి – ట్విట్టర్ కు మధ్య వివాదాలు నడుస్తున్నాయి. తాజాగా వెంకయ్య ట్విట్టర్ అకౌంట్ వివాదం తలెత్తింది. ఇది ఎటు దారితీస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్