Saturday, September 21, 2024
HomeTrending NewsCM- UAE Ambassador: సిఎం జగన్ తో యూఏఈ రాయబారి భేటీ

CM- UAE Ambassador: సిఎం జగన్ తో యూఏఈ రాయబారి భేటీ

భారత్‌లో యూఏఈ రాయబారి అబ్ధుల్‌నాసర్‌ అల్షాలి తాదేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై వీరిద్దరి మధ్యా చర్చ జరిగింది.  రాష్ట్రంలో పారిశ్రామిక  విధానాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని, ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని సిఎం తెలియజేశారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

ఫుడ్‌ పార్క్‌ లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్స్, టూరిజం, హాస్పిటాలిటీ, గ్రీన్‌ హైడ్రోజన్, పోర్ట్‌లు, పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ లు, మౌలిక సదుపాయాల కల్పన వంటి వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నామని, ఏపీని పెట్టుబడులకు లీడ్‌ స్టేట్‌గా పరిగణిస్తున్నామని యూఏఈ రాయబారి ముఖ్యమంత్రితో అన్నారు.

పెట్టుబడుల సదస్సులో చర్చించిన అంశాలతో పాటు మున్ముందు ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమావేశంలో సీఎం స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ పూనం మాలకొండయ్య, యూఏఈ రాయబార కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్