Saturday, May 11, 2024
HomeTrending Newsకెసిఆర్ ఇస్తున్నవి కేంద్ర పథకాలే

కెసిఆర్ ఇస్తున్నవి కేంద్ర పథకాలే

రైతు బందు పథకం బాగుందని నేను రాష్ట్ర ప్రభుత్వం ను పొగడలేదని,  రాష్ట్ర ప్రభుత్వం ను పొగిడినట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లాజే అసంతృప్తి వ్యక్తం చేశారు.  కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిది పేరు మార్చి రైతు బందు అని పెట్టారన్నారు.  ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కిసాన్ సమ్మాన్ నిధి అమలు చేస్తున్నాయని తెలిపారు. మెదక్ జిల్లాలో సాగుతున్న బండి సంజయ్ పాదయాత్రలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లాజే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ……కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహాయానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా సాయం చేస్తూ పేరు మార్చుకుంది.  మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తరువాత రైతుల ఆదాయం పెంచాడు. ఇప్పుడు ప్రధానిగా కూడా దేశ రైతుల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. దేశంలో 80శాతం చిన్న సన్నకారు రైతులే.. వారికి సాయం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు.

11కోట్ల రైతులకు కిసాన్ సమ్మాన్ నిధిద్వారా కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తోంది. ఫసల్ భీమా యోజన తెలంగాణ లో ఎందుకు అమలు చేయడం లేదు. పెట్టుబడులు పెట్టి పంటనష్టపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సమావేశానికి కూడా కేసీఆర్ హాజరు కాలేదు.

కేంద్రం సిద్దం చేసిన యాప్ లో పంట నష్టం ఫోటో అప్లోడ్ చేస్తే చాలు..పరిహారం వస్తుంది. రాష్ట్రంలో ఎంత మంది కి ఇల్లు ఇచ్చారు కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వం కు అన్ని విధాలా సాయం అందిస్తున్నాం. నిధుల వినియోగ సర్టిఫికెట్ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం లేదు. సర్టిఫికెట్ ఇవ్వక పోతే వచ్చే ఏడాది నిధులు ఇవ్వరు. దేశంలో చాలా రాష్ట్రాలు ధాన్యం పండిస్తున్నాయి.. ఎక్స్ పోర్ట్ చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోంది.

అధికంగా ఉత్పత్తి అయిన ధాన్యం అమ్మేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు ఏంటి? ఏ దేశానికి ఏం కావాలి అన్న వివరాలు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయి. తెలంగాణ నుంచి ఎంత ధాన్యం ఎగుమతి అవుతుంది.. ఏం ఎగుమతి చేస్తున్నారు. ఫెస్టిసైడ్స్ వినియోగం తగ్గించేందుకు ఏం కార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణ లో ఎంతో చేయవచ్చు.. రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకరించడం లేదు.

ప్రతి నెల తెలంగాణ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తాం. మూడు నాలుగు నెలల కు ఒకసారి నేను స్వయంగా వస్తా. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలిస్తా. ప్రాసెసింగ్.. మార్కెటింగ్ కోసం తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావాలి. సంజయ్ పాదయాత్ర లో రైతులతో పాటు వివిధ వర్గాల తో చర్చిస్తున్నారు. వారి సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు.

నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయలేదు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగితే కూడా ఇవ్వలేదు. మాకే అపాయింట్మెంట్ ఇవ్వని కెసిఆర్ సామాన్య ప్రజలకు ఏం చేస్తాడు. కేంద్ర ప్రభుత్వం కు ఎంతకావాలో అంత కొనుగోలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లాజే ప్రశ్నించారు.

అంతకు ముందు ప్రజా సంగ్రామ యాత్రలో చత్తిస్ గడ్ మాజీ ముఖ్యమంత్రి రామన్ సింగ్ , బిజెపి నాయకురాలు విజయశాంతి, ఎమ్మెల్యే రఘునందన్ రావు తదితర పార్టీ నేతలో పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్