Saturday, January 18, 2025
Homeసినిమామ‌హేష్ తండ్రి పాత్రలో కన్నడ స్టార్?

మ‌హేష్ తండ్రి పాత్రలో కన్నడ స్టార్?

Kannada Actor: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో అత‌డు, ఖ‌లేజా చిత్రాలు రూపొంద‌డం.. ఆ సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ ఎలా ఉన్నా.. ప్రేక్ష‌కుల‌ను మాత్రం బాగా ఎంట‌ర్ టైన్ చేశాయి. మ‌హేష్ లోని స‌రికొత్త యాంగిల్ ని బ‌య‌ట‌కు తీసారు త్రివిక్రమ్. దీంతో ఎప్ప‌టి నుంచో ఈ కాంబినేష‌న్లో మూవీ వ‌స్తే చూడాల‌నుకున్నారు అభిమానులు. అది ఇప్ప‌టికి సెట్ అయ్యింది. ప్ర‌స్తుతం ఈ క్రేజీ మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది.

ఈ నెల‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. అయితే.. ఈ సినిమాలో హీరో ఫాద‌ర్ క్యారెక్ట‌ర్ ఉంద‌ట‌. అది క‌థ‌లో చాలా కీల‌క‌మైన పాత్ర‌. ఈ పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ నటించబోతున్నార‌ని గతంలో వార్తలు వచ్చాయి కానీ.. అనిల్ క‌పూర్ ఈ మూవీలో న‌టించ‌డం లేద‌ట‌. ఇప్పుడు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర మహేష్ కి ఫాదర్ గా ఈ సినిమాలో న‌టిస్తున్నార‌ట‌.

అయితే.. కేవలం ప్లాష్ బ్యాక్ లో మాత్రమే ఉపేంద్ర పార్ట్ ఉంటుందని.. మహేష్, ఉపేంద్ర కాంబినేషన్ లో సీన్స్ ఉండవు అని తెలుస్తోంది. గ‌తంలో ఉపేంద్ర‌.. త్రివిక్ర‌మ్ స‌న్నాఫ్ స‌త్యమూర్తి సినిమాలో న‌టించారు. ఇప్పుడు రెండోసారి ఆయ‌న డైరెక్ష‌న్ లో న‌టించ‌బోతున్నార‌ని టాక్. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఈ సినిమా రూపొందుతోంది.

Also Read : మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ చ‌ర్చ‌లు ఎక్క‌డో తెలుసా..? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్